
రష్యా స్టార్ టెన్నిస్ ప్లేయర్ మెద్వెదెవ్ కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కొట్టి చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో సెర్బియా యోధుడు నొవాక్ జోకోవిచ్ పై 6-4, 6-4, తేడాతో గెలిచి విజయకేతనం ఎగరేశాడు. యూఎస్ ఓపెన్ 2019 లో రన్నరప్ గా నిలిచిన మెద్వెదెవ్ ఈసారి ప్రపంచ నం.1 జకోపై నెగ్గి హిస్టరీ క్రియేట్ చేశాడు. కాగా 25 ఏళ్ల మెద్వెదెవ్ ప్రస్తుతం రెండో ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.