ఏపీలో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నారంటూ బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దాడులకు పాల్పడుతున్న దుండగులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేయడంతో వైసీపీ నేతలు మాటలయుద్ధానికి దిగారు.
Also Read: ఏపీ మంత్రిపై వచ్చిన ఆరోపణలు నిజమేనా?
ఏపీలోని అంతర్వేది రథం దగ్ధం సంఘటన తర్వాత బీజేపీ, వైసీపీ మధ్య విమర్శల వేడిపెరిగింది. దీంతోపాటు తాజాగా తిరుపతి దేవస్థానంలో డిక్లేషన్ పై వివాదం నెలకొంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్న సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ తీరుపై మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది.
అయితే తన వ్యాఖ్యలపై ఎవరికీ వివరణ ఇవ్వాలని అవసరం లేదంటూనే మంత్రి కొడాలి నాని ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్య నాథ్ లపై విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. గురువారం రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి.
Also Read: మరోసారి వార్తల్లోకి టీవీ9.. రజినీకాంత్ వైదొలిగాడా..?
హిందువుల మనోభావాలను దెబ్బతీసే మాట్లాడిన కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని.. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈక్రమంలో పోలీసులు అక్కడి చేరుకొని బీజేపీ నేతలను అరెస్టు చేసేందుకు యత్నించడంతో ఉద్రిక్తతలకు దారితీశాయి. విజయవాడలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, తిరుపతి భానుప్రకాశ్ రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు బీజేపీ ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. అన్ని జిల్లాల్లో బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని నిరసన తెలిపారు.