BJP And TRS Competing For Power: తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ ఒక వైపు చూస్తుంది. అధికారమే ప్రధాన ఎజెండాగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతోంది. అప్పుడే పార్టీల్లో వ్యూహాలు మొదలయ్యాయి. ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టే విధంగా ప్రణాళికలు అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నాయి. బీజేపీ మాత్రం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రజాసంగ్రామ యాత్ర రెండు దఫాలు చేసి అధికార పార్టీని ఎండగట్టింది. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ ను జైలుకు పంపుతామని నేతలు చెప్పడం కొసమెరుపు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో టీఆర్ఎస్ పార్టీ మరింత దిగజారుతోంది. అందుకే రాబోయే ఎన్నికల్లో దానికి ఘోరీ కట్టడం ఖాయమని చెబుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏవో చేస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. బలుపును చూసుకుని వాపు అని మురుస్తోంది టీఆర్ఎస్. ప్రజల్లో వ్యక్తమవుతోన్న వ్యతిరేకతతో ప్రస్తుతం పార్టీ పాతాళంలో పడనున్నట్లు తెలుస్తోంది.
నాయకుడు అనే వాడు ప్రజల నుంచి వస్తాడు. వారసత్వం నుంచి కాదు. కేటీఆర్ ను సీఎంను చేయాలనే కేసీఆర్ ఆలోచనతో ప్రజల్లో పట్టుకోల్పోతోంది. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి చెడు ఫలితాలే ఎదురు కానున్నాయి. అడగని వాటిని చేస్తూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నట్లు చెబుతున్నారు దీంతోనే పార్టీ పరువు గంగలో కలుస్తోంది. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరికి కూడా ఏం లాభం లేకుండా పోతోంది. అందుకే వారిలో నైరాశ్యం పెరిగిపోతోంది. దీంతో ప్రజాప్రతినిధుల్లో కూడా ఆగ్రహం పెరుగుతోంది.
Also Read: Caste Politics In Telugu States: ఏపీలో కమ్మ, రెడ్లు.. తెలంగాణలో వెలమ, రెడ్లు.. వేరే నేతలే లేరా?
భవిష్యత్ లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడం అనుమానమే. అన్ని తామే చేసినట్లు చెప్పుకుంటున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసమే అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. టీఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు కదా మాకు కూడా ఓసారి ఇవ్వాలని ప్రాధేయడుతోంది. మొత్తానికి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగనుంది.
Also Read: Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’