Reversing Telangana: నీళ్లు.. నిధులు.. నియామకాలు.. స్వయం పాలన.. ఆత్మగౌరవం.. ఇవీ స్వరాష్ట్ర ఆకాంక్షలు. ఇవే నినాదాలతో ఉద్యమించిన యావత్ తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సిద్ధించిన తర్వాత ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరుతాయని సబ్బండవర్గాలు ఆశించాయి. ఈ క్రమంలో తెలంగాణలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని తెలంగాణ ఉద్యమ సారథి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలోని టీఆర్‌ఎపార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మొదటి నాలుగేళ్లు జనాకర్షక పథకాలు ప్రవేశపెట్టి అరచేతిలో వైకుంఠం చూపిన సీఎం కేసీఆర్ ఆరునెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. 2018లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను మళ్లీ అధికారంలోకి వస్తేనే స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేరుతాయని తెలిపారు. లేదంటే బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కాదని పేర్కొన్నారు. దీంతో ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌నే గెలిపించారు. ప్రస్తుతం ఎనిమిదిన్నరేళ్ల పాలన పూర్తియింది. కానీ ఏ ఆశంయ, ఆకాంక్షల కోసం స్వరాష్ట్రం సాధించుకున్నారో అది నెరవేరలేదు. ఎనిమిదేళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాలేదు. మిగుల బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రం నాలుగ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగోతంది. మరోవైపు అధికారం ఉందని అక్రమంగా కేసులు పెట్టడం, భూఆక్రమణలు, దౌర్జన్యాలు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు, ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. అసైన్డ్, పోడు భూములు లాక్కునే ప్రయత్నాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది.

ఓరుగల్లు నుంచి షురూ…
వరంగల్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేపట్టిన భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా ప్రకటన జారీ చేశారు. వందల ఎకరాల సారవంతమైన భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. అయితే బలవంతంగా భూములు తీసుకునేందుకు యత్నించారు. పోలీసులను మోహరించారు. అయితే రైతులంతా ఏకమై ప్రభత్వం, ప్రజాప్రతినిధులపై దాడి చేసే వరకు వెళ్లారు. ఎకరం భూమి తీసుకున్నా వచ్చే ఎన్నికల్లో అంతు తేలుస్తామని హెచ్చరించారు. దీంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్‌ను ఆపివేస్తున్నట్లు కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్ తెలిపారు. రైతులను చల్లబర్చేందుకు సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, భూముల అభివృద్ధి కోసం రైతులు సహకరిస్తున్నా కొందరు ఉద్దేశపూర్వకంగా వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రకటించారు. రైతుల తిరుగబాటుతో ప్రభుత్వం వెనుకడుగు వేయక తప్పలేదు. పోలీసు బలం కూడా ఇక్కడ పనిచేయలేదు.
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ యూ టర్న్.. టీడీపీ మంచి పార్టీ అని కితాబు
తాజాగా మల్లారెడ్డిపై…

రెడ్ల సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ప్రభుత్వంపై ఆ సామాజికవర్గంలో ఉన్న అసహనానికి అది సూచిక అని కొంత మంది చెబుతూంటే.. మంత్రి మాత్రం రేవంత్ రెడ్డే ఇదంతా నడిపించారని అంటున్నారు. కుల సమావేశంలో కేసీఆర్ ను అతిగా పొగడతంతో మల్లారెడ్డిపై దాడి జరిగింది. రెడ్ల సింహాగర్జనలో ఒక్క మల్లారెడ్డి మాత్రమే కాదు .. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ రెడ్డి నేతలందరూ హాజరయ్యారు. అందరూ సామాజిక కోణంలోనే ప్రసంగించారు. ఎవరిపైనా హాజరైన వారిలో వ్యతిరేకత రాలేదు .కానీ మల్లారెడ్డి మరీ ఓవర్‌గా కేసీఆర్‌ను పొగడటంతో ఆ సామాజికవర్గంలో కోపం వచ్చేసింది. అదే సమయంలో ప్రసంగం ఆపి.. కాసేపు అక్కడే ఉన్నా సరిపోయేది. కానీ హడావుడిగా వెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత మంది దాడికి ప్రయత్నం చేశారు. పారిపోతున్నారన్న ప్రచారం జరగడంతో మరింత మంది దాడి చేశారు. మల్లారెడ్డి రాజకీయాల విషయంలో ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉన్నారని టీఆర్‌ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.
ఈ రెండు తిరుగుబాట్లు రాష్ట్రమంతటా స్ఫూర్తి నింపితే వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పరాభవం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: Mahesh Babu Waiting For Her Video: ఆమె వీడియోల కోసం మహేష్ ఆత్రుతగా ఎదురుచూస్తుంటాడు !


