Bithiri Sathi : బిత్తిరి సత్తి ప్రసంగానికి షేక్ అయిపోయిన వేదిక.. కేసీఆర్ పై ఏం మాట్లాడాడు భయ్యా.. వైరల్ వీడియో

హైదరాబాద్ వేదికగా ముదిరాజ్ సామాజికవర్గం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వేలల్లో ఈ సభకు జనాలు తరలి వచ్చారు. ఈ వేదిక సాక్షిగా బిత్తిరి సత్తి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.

Written By: NARESH, Updated On : October 14, 2023 11:59 am

bithiri sathi1

Follow us on

Bithiri Sathi : ఇండియాలో రాజకీయాలంటే సామాజిక సమీకరణాలే. కులాల చుట్టే కుర్చీలాటలు జరుగుతుంటాయి. పదవులు, పంపకాలు దీని మీదే ఆధారపడి ఉంటాయి. తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగగా… ముదిరాజ్ సామాజిక వర్గం అధికార బిఆర్ఎస్ పై తిరగబడిన సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా ముదిరాజ్ సామాజికవర్గం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వేలల్లో ఈ సభకు జనాలు తరలి వచ్చారు. ఈ వేదిక సాక్షిగా బిత్తిరి సత్తి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.

నత్తిగా మాట్లాడుతూ కామెడీ చేసే సత్తిలోని మరో కోణం ఈ వేదిక మీద ఆవిష్కృతం అయ్యింది. ఘాటైన పొలిటికల్ ఆరోపణలు, హెచ్చరికలతో ఆయన స్పీచ్ సాగింది. 50-60 లక్షల మంది ముదిరాజ్ సామాజిక వర్గ ఓటర్లు ఉంటే… 115 సీట్లలో ఒకటి కూడా బిఆర్ఎస్ ఇవ్వలేదన్నారు. కేటీఆర్ సర్ నామినేటెడ్ పదవులు ఇస్తాం అంటున్నారు. చప్ప చప్పగా ఉండే నామినేటెడ్ పదవులు మాకొద్దు. పోటీ పడే పదవులు కావాలని అన్నారు. మేము తెలుగు దెంకరోళ్ళమా? తాగుబోతు జాతా?. అణచిపెట్టి గుద్దితే వంగబడి పిత్తాలే.. అనే సీరియస్ అయ్యాడు.

బిత్తిరి సత్తిగా కాదు ముదిరాజ్ రవికుమార్ గా మాట్లాడుతున్నా అంటూ ఊహించని యాంగిల్ బయటకు తీశాడు. ఇదే వేదికపై బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ పై బిత్తిరి సత్తి ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ తరపున జడ్చర్ల నియోజకవర్గం నుండి బిత్తిరి సత్తి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రతిపాదన ఉందని, మిత్రులు కొందరు నన్ను కలిశారని బిత్తిరి సత్తి ఒప్పుకోవడం విశేషం.

ఇక కామెడీ, సెటైరికల్ వార్తల్లో బిత్తిరి సత్తిగా రవికుమార్ ఫేమస్ అయ్యాడు. విలక్షణ బాడీ లాంగ్వేజ్, మాట తీరు బిత్తిరి సత్తి ప్రత్యేకతలు. స్టార్స్ ని తమ చిత్రాల విడుదలకు ముందు ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని సైతం బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు. బుల్లితెర కమెడియన్ గా ఫేమస్ అయిన బిత్తిరి సత్తి వెండితెర మీద కూడా సందడి చేస్తున్నాడు.