https://oktelugu.com/

Payal Rajput: ఆ డైరెక్టర్ ను పాయల్ రాజ్ పుత్ అంత దారుణంగా మోసం చేసిందా?

బోల్డ్ బ్యూటీ విషయంలో కూడా అదే జరిగిందట. ఈమె ఓ డైరెక్టర్ ను అవకాశాల కోసం వాడుకొని వదిలేసిందట. హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పాయల్ కు అవకాశాలు లేక సీరియల్స్ లో నటించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 14, 2023 / 11:50 AM IST

    Payal Rajput

    Follow us on

    Payal Rajput: ఆర్ఎక్స్ 100 తో యూత్ గుండెల్లో నిలిచిపోయింది పాయల్ రాజ్ పుత్. ఈ అమ్మడును గుర్తు పట్టని వారుండరు. అంతలా పాతుకొని పోయింది ఈ బోల్డ్ బ్యూటీ.ఆర్ఎక్స్ 100 తర్వాత కూడా బోల్డ్ క్యారెక్టర్లలో నటించడానికి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఎందుకంటే మొదటి సినిమాలోనే బోల్డ్ గా కనిపించిన ఈ బ్యూటీని తర్వాత కూడా బోల్డ్ గా చూపించడానికే ఎక్కువ మంది ఇష్టపడ్డారట. అందుకే అలాంటి అవకాశాలే వచ్చాయని టాక్. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో హీరోయిన్ లకు, డైరెక్టర్లలతో ఎఫైర్లు ఉంటాయనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది.

    బోల్డ్ బ్యూటీ విషయంలో కూడా అదే జరిగిందట. ఈమె ఓ డైరెక్టర్ ను అవకాశాల కోసం వాడుకొని వదిలేసిందట. హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పాయల్ కు అవకాశాలు లేక సీరియల్స్ లో నటించింది. అలా స్టార్ ప్లస్ లో వచ్చే చాలా సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఇలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేదట పాయల్. ఇదే సమయంలో వరుస అవకాశాలు ఇస్తూ పాయల్ ప్రేమలో పడ్డారట డైరెక్టర్ రాకేష్ కుమార్. ఈయనతో అవకాశాల కోసం క్లోజ్ గా ఉండేదట.

    చాలా రోజులుగా రిలేషన్ లో ఉండడంతో పెళ్లి చేసుకోవాలని రాకేష్ తన ఇంట్లో చెప్పేశారట. వీరి పెల్లికి రాకేష్ ఇంట్లో పెద్దలు కూడా అంగీకరించారని వినికిడి. వెంటనే ఇదే మాటను పాయల్ తో చెబితే తను కూల్ గా రిజక్ట్ చేసిందట. తన గోల్ సినిమాలో హీరోయిన్ అవడమని.. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తిరస్కరించిందట బోల్డ్ బ్యూటీ. దీన్ని తట్టుకోలేని డైరెక్టర్ ఒకే అని బ్రేకప్ చెప్పేశారట. విషయం అర్థమైన రాకేష్ అవకాశాల కోసం మాత్రమే తన దగ్గర క్లోజ్ గా ఉందని స్నేహితుల వద్ద చెప్పారట. మరి ఇందులో నిజం ఎంత అనేది వారికి మాత్రమే తెలియాలి. ఇదిలా ఉంటే అప్పుడు సీరియల్స్ లో నటించిన పాయల్ ఆర్ ఎక్స్ 100తో సక్సెస్ ను సాధించి మరిన్ని సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది.