డ్యాషింగ్ డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్మాథ్ కు మంచి గుర్తింపు ఉంది. ఉన్నది ఉన్నట్లుగా.. విషయాన్ని సాగదీయకుండా ముక్కుసూటిగా మాట్లాడటం.. ఆ మాటలతో అందరినీ మెప్పించడం పూరి స్టైల్. సినిమాలతో ఫుల్ బీజీగా ఉండే పూరి జగన్మాథ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నాడు.
Also Read: అఖిల్ ఎలిమినేషన్.. మరోసారి దొరికిన బిగ్ బాస్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్మాథ్ కొద్దిరోజులుగా ఆసక్తికరమైన విషయాలపై వాయిస్ మేసేజ్ లు పెడుతున్నారు. సమాజంలోని వివిధ సమస్యలపై తనదైన విశ్లేషణ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవలే పూరి జగన్మాథ్ ‘ఆత్మహత్య’ అనే అంశంపై మాట్లాడి అందరినీ ఆలోచించ చేయగా మరోసారి బ్రిటిషర్ల వారి గొప్పతనాన్ని ఇండియన్స్ కు వివరించాడు.
ప్రస్తుతం యూనైటెడ్ కింగ్ జనాభా కేవలం 6.5కోట్లు అని.. మరీ ఇప్పుడే ఇంత తక్కువగా ఉంటే 16వ శతాబ్దంలో వారి జనాభా 50లక్షలకు మించి ఉండదని తెలిపారు. దీనిలో నుంచి వారి సైన్య 50వేలకు మించి ఉండదని.. వాళ్ల కంటే మనదేశం 13రెట్లు పెద్దది అయినా వాళ్లు మనదేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు? అనే దానిని పూరి తనదైన శైలిలో విశ్లేషించారు.
మనం హిమలయాలు ఎక్కి అవతాల ఏముందో చూడం.. సరదాగా శ్రీలంక కూడా వెళ్లం..మనం నూతిలో కప్పలం.. కానీ తక్కువ జనాభా ఉన్న ఓ చిన్నదేశమైన బ్రిటిష్ వాళ్లు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించారు. ప్రపంచంలోని 22దేశాలు మినహా అన్ని దేశాలను పాలించారు.
Also Read: అఖిల్ ఎలిమినేషన్.. మరోసారి దొరికిన బిగ్ బాస్
అందరికీ షర్టు.. ప్యాంట్లు వేసుకోవడం నేర్పించారు.. వారి భాషను అందరికీ పరిచయం చేశారు. వాళ్లు ఆక్రమించుకున్న దేశాలను సొంత దేశంలా అభివృద్ధి చేశారు. వ్యవస్థను అర్థం చేసుకునేందుకు అన్ని దేశాల వాళ్లను లండన్ తీసుకొని బారిష్టర్ చదివించారు. రోజుకు కొన్ని వందల షిప్పులు లండన్ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేసేవని తెలిపారు.
ఆ తర్వాత బ్రిటిష్ వారు ఎందుకు ఫైయిలయ్యారనేది కూడా పూరి తనదైన శైలిలో వివరించాడు. మనం ఒక్క కంపెనీని స్థాపించి పదిచోట్ల రన్ చేయడానికే చాలా కష్టపడుతుంటాం. అలాంటిది బ్రిటిష్ వాళ్లు వందల దేశాలను ఒక పద్దతి ప్రకారంగా పాలించారంటే వారికి ఎంత ముందు చూపు ఉండాలో అర్థం చేసుకోవాలన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఆ తర్వాత అన్ని దేశాల్లో స్వాతంత్ర్యం కోసం పోరాటాలు.. రెండో వరల్డ్ వార్ లో బ్రిటిషర్స్ ఓడిపోవడంతో వారికి చిరాకేసి అందరికీ స్వాతంత్ర్యం ఇచ్చుకుంటూ వెళ్లిపోయాయని తెలిపారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చే నాటికి వారి జనాభా కేవలం 10వేలేనని తెలిపారు. వీరిలో 2వేలమంది తిరిగి బ్రిటిష్ కు వెళ్లగా మిగతా వారు ఇక్కడి స్థిరపడ్డారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఆంగ్లో ఇండియన్స్ జనాభా కేవలం లక్షా పాతికవేలేనని తెలిపారు.