https://oktelugu.com/

బీహార్ కా షేర్ తేజస్వి..మోడీ-నితీష్ కు షాక్ యేనా?

ఎంతో ప్రతిష్టాత్మకమైన బీహార్‌‌ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికాబోతున్నాయి. మూడు దశల్లో జరిగిన పోలింగ్‌లో బీహార్ ఓటర్లు ఈవీఎంలలో వారి తీర్పును నిక్షిప్తం చేశారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉండగా.. అందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కలిగిన స్థానాలు 38 ఉన్నాయి. అక్టోబర్ 28న మొదటి దశలో 71 నియోజకవర్గాలకు (1,066 మంది అభ్యర్థులు) పోలింగ్ జరిగింది. ఆ తర్వాత నవంబర్ 3న రెండో దశలో 94 సీట్లకు(1,463 మంది అభ్యర్థులు), నవంబర్7న మూడో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2020 / 09:57 AM IST
    Follow us on

    ఎంతో ప్రతిష్టాత్మకమైన బీహార్‌‌ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికాబోతున్నాయి. మూడు దశల్లో జరిగిన పోలింగ్‌లో బీహార్ ఓటర్లు ఈవీఎంలలో వారి తీర్పును నిక్షిప్తం చేశారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉండగా.. అందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కలిగిన స్థానాలు 38 ఉన్నాయి. అక్టోబర్ 28న మొదటి దశలో 71 నియోజకవర్గాలకు (1,066 మంది అభ్యర్థులు) పోలింగ్ జరిగింది. ఆ తర్వాత నవంబర్ 3న రెండో దశలో 94 సీట్లకు(1,463 మంది అభ్యర్థులు), నవంబర్7న మూడో దశలో 78 సీట్లకు(1,204 మంది అభ్యర్థులు) పోలింగ్ జరిగింది. మొత్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 3,733 మంది బరిలో నిలిచారు. వీరిలో 371 మంది మహిళలు ఉన్నారు.

    Also Read: మధ్యప్రదేశ్‌ అప్‌డేట్స్‌: 9 సీట్లు వస్తే బీజేపీదే అధికార పీఠం

    అయితే.. ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్‌ను చూస్తుంటే ప్రతీ పదిహేను ఏళ్లకోసారి ఆ రాష్ట్ర రాజకీయాలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. జయప్రకాశ్‌ నారాయణ్ సోషలిస్టు ఉద్యమం తర్వాత ఆవిర్భవించిన నేతల్లో ఒకరైన లాలూప్రసాద్‌ యాదవ్‌ 30 ఏళ్ల క్రితం బీహార్‌ పగ్గాలు చేపట్టి ఏకధాటిగా మూడు సార్లు అధికారంలో కొనసాగారు. ఆ తర్వాత నితీశ్‌ హయాం నడిచింది. ఈయన కూడా జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడే. లాలూ కుటుంబం అరాచక పాలన నుంచి విసుగెత్తిపోయిన బీహారీలు నితీశ్‌ను 15 ఏళ్లుగా వరుసగా గెలిపించడం మొదలుపెట్టారు. మూడు పర్యాయాలు అధికార పగ్గాలు అందుకున్న నితీశ్‌ కూడా ఇప్పుడు వారికి బోర్‌ కొట్టేసినట్లే కనిపిస్తున్నాడు. దీంతో ప్రత్యర్థి తేజస్వీ యాదవ్‌కు ఒక్క ఛాన్స్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే సూచనలు కనిపిస్తున్నాయి రిజల్ట్స్‌ను చూస్తుంటే.

    Also Read: బీహార్‌‌లో సీన్‌ రివర్స్‌.. ఆధిక్యంలోకి ఎన్డీఏ

    బీహార్‌లో 2015లో జరిగిన ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి విడిపోయి మహాకూటమితో కలిసి సీఎం పీఠాన్ని అందుకున్న నితీశ్‌ కుమార్‌ ఆ తర్వాత కూటమికి వెన్నుపోటు పొడిచారు. అనతికాలంలోనే మహాకూటమి ప్రభుత్వాన్ని కూల్చి తిరిగి ఎన్డీయేతో కలిసి సీఎం అయిపోయారు. నితీశ్‌పై ఎన్నో ఆశలతో సీఎం పగ్గాలు అప్పజెప్పిన మహాకూటమి నేతలకు ఇదో పరాభవంగా మిగిలిపోయింది. నాలుగేళ్లలో నితీశ్‌ కుమార్‌ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. తేజస్వీ యాదవ్‌ కూడా నితీశ్‌ను గద్దె దింపేందుకు ఇదే సరైన సమయమని భావించారు. గతంలో మహాకూటమికి నితీశ్‌ వెన్నుపోటు పొడిచిన విషయాన్ని జనంలోకి గట్టిగా తీసుకెళ్లారు. దాన్ని జనం కూడా గుర్తించినట్లు ఎగ్జిట్‌ పోల్ సర్వేలు చెప్పకనే చెప్పాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    గత ఎన్నికల్లో తమతో కలిసి అధికారం సాధించి ఆ తర్వాత ఎన్డీయే పంచన చేరిన నితీశ్‌ కుమార్‌పై తేజస్వి రగిలిపోతున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని బీహార్‌లో కీలకమైన యువతను టార్గెట్‌ చేసి వారిని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్‌ అయ్యారనేది కనిపిస్తోంది. ముఖ్యంగా మహాకూటమి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీహార్‌ యువత తేజస్వీ ప్రతీకారాన్ని ఓన్‌ చేసుకున్నట్లే కనిపిస్తోంది. ఈసారి మహాకూటమిని నడిపిస్తున్న ఆర్జేడీ మరోసారి అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలవబోతుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.