Bihar : కష్టపడితే విజయం దానంతట అదే వస్తుంది. కాకపోతే ఆ పడే కష్టంలో నిజాయితీ ఉండాలి. శ్రద్ధ ఉండాలి. అంతకుమించి ఆసక్తి ఉండాలి. చేసే పని మీద ప్రేమ ఉండాలి. అప్పుడే విజయం అనేది సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని నిరూపించారు బీహార్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థులు. దేశ వ్యాప్తంగా తీవ్రంగా పోటీ ఉండే జేఈఈ మెయిన్స్ లో వారు సత్తా చాటారు. అంతేకాదు తమ గ్రామం నుంచి 40 మంది ఐఐటి జేఈఈ మెయిన్స్ కు ఎంపికయ్యారు. అలాగని ఆ గ్రామం స్థితిమంతమైనది కాదు. అక్కడ పారాయణ, రైతన్య లాంటి విద్యాసంస్థలు లేవు. ఆగని ఆ గ్రామం రాజస్థాన్లోని కోట లాంటిది కాదు.. ఇంతకీ ఆ గ్రామం చరిత్ర ఏమిటి? 40 మంది ఐఐటి జేఈఈ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించడం ఏంటి.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
Also Read : తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా, జాతీయ స్థాయిలో అగ్ర ర్యాంకులు
ఒకే గ్రామంలో 40 మంది పాస్
సాధారణంగా ఓ గ్రామంలో ఒకరు లేదా ఇద్దరు ఐఐటీ జేఈఈ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధిస్తారు. వాస్తవానికి ఇటువంటి సంఘటనలు కూడా అరుదుగా చోటుచేసుకుంటాయి. కానీ బీహార్ రాష్ట్రంలోని పట్వటోలి గ్రామంలో ఏకంగా 40 మంది విద్యార్థులు ఐఐటీ జేఈఈ మెయిన్స్ లో అదరగొట్టారు. కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల విద్యార్థులకు కూడా సాధ్యం కాని రికార్డులను నెలకొల్పారు. ఈ గ్రామంలో “వృక్ష సంస్థాన్” అనే సంస్థ ఈ గ్రామంలో విద్యార్థులకు ఐఐటి జేఈఈ మెయిన్స్ లో ఉచితంగా కోచింగ్ ఇస్తోంది. ఇక ఇటీవల ప్రకటించిన ఐఐటీ జేఈఈ మెయిన్స్ లో వృక్ష సంస్థాన్ సంస్థ నుంచి 28 మంది విద్యార్థులు ప్రతిభ చూపడం విశేషం. అంతేకాదు ఈ గ్రామంలో ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నాడు. అందువల్లే ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు ఐఐటీ టార్గెట్ గా చదువుతున్నారు. చివరికి తమకలను సహకారం చేసుకుంటున్నారు. ఏకంగా 40 మంది విద్యార్థులు ఐఐటి జేఈఈ మెయిన్స్ లో ఉతీర్ణత సాధించారంటే వారి ప్రతిభ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లే పట్వటోలి లో మాదిరిగానే దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో వృక్ష సంస్థాన్ సంస్థ ఐఐటీ జేఈఈ మెయిన్స్ లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు..” మా గ్రామంలో విద్యార్థులు బాగా చదువుతారు. వృక్ష సంస్థాన్ సంస్థ బాధ్యులు మా గ్రామానికి వచ్చి విద్యార్థులకు అనేక విధాలుగా శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు నిత్యం పరీక్షల నిర్వహించేవారు. అది అంతిమంగా ఉత్తమ ఫలితాలు రావడానికి దోహదపడింది. వృక్ష సంస్థాన్ సంస్థలు శిక్షణ పొందిన 28 మంది విద్యార్థులకు ఐఐటి జేఈఈ మెయిన్స్ ర్యాంకులు వచ్చాయి. మా గ్రామంలో ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నాడు. అందువల్లే పిల్లల్లో చదువుకోవాలనే కోరిక విపరీతంగా ఉంది. మారుమూల గ్రామం అయినప్పటికీ ఐఐటీ జేఈఈ మెయిన్స్ లో 40 మంది ఎంపిక కావడం.. మా గ్రామం స్థాయిని పెంచిందని” పట్వటోలి గ్రామస్తులు చెబుతున్నారు.