https://oktelugu.com/

YCP: జగన్ కు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. చంద్రబాబు భార్య కాళ్లు కన్నీళ్లతో కడుగుతాడట!

YCP:  ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కన్నీళ్లకు ఆఖరుకు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యేలే కరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. నిండు అసెంబ్లీలో తన భార్యను తిట్టినందుకు చంద్రబాబు వలవల ఏడ్చేశాడు. దీనిపై ఆయనకు సానుభూతి వెల్లివిరిసింది. అయితే వైసీపీ నుంచి మాత్రం చంద్రబాబుపై ఎదురుదాడి వచ్చేసింది. చంద్రబాబు ఏడిపించిన లిస్టును వైసీపీ బ్యాచ్ బయటపెట్టేసింది. ఓవైపు వైసీపీ మంత్రులు, అధికార పార్టీ నేతలు అంతా చంద్రబాబునాయుడువి అన్నీ డ్రామాలని.. నారా భువనేశ్వరిపై ఎవరూ వ్యాఖ్యలు చేయలేదంటూ పదే పదే చెబుతున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2021 6:17 pm
    Follow us on

    YCP:  ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కన్నీళ్లకు ఆఖరుకు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యేలే కరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. నిండు అసెంబ్లీలో తన భార్యను తిట్టినందుకు చంద్రబాబు వలవల ఏడ్చేశాడు. దీనిపై ఆయనకు సానుభూతి వెల్లివిరిసింది. అయితే వైసీపీ నుంచి మాత్రం చంద్రబాబుపై ఎదురుదాడి వచ్చేసింది. చంద్రబాబు ఏడిపించిన లిస్టును వైసీపీ బ్యాచ్ బయటపెట్టేసింది.

    YCP

    rachamallu

    ఓవైపు వైసీపీ మంత్రులు, అధికార పార్టీ నేతలు అంతా చంద్రబాబునాయుడువి అన్నీ డ్రామాలని.. నారా భువనేశ్వరిపై ఎవరూ వ్యాఖ్యలు చేయలేదంటూ పదే పదే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

    తాజాగా నారా భువనేవ్వరిని అన్న మాటలపై కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రజాగౌరవ సభలపై ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.

    ‘ప్రజాగౌరవ సభల పేరుతో అందరికీ సోదరి సమానులైన చంద్రబాబు సతీమణి శీలాన్ని బజారుకీడ్చడం బాధాకరమంటూ రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను ఇలాంటి సభల ద్వారా మరింత బాధపెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు.

    Also Read: లోకేష్ ను చంద్రబాబే ఓడించారట..?

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా తమందరికీ ఒకే గౌరవమంటూ ఆయన అన్నారు. ఎవరైనా ఏ మహిళనైనా కించపరచడం సరైంది కాదన్నారు. ఎవరు చేసినా అది తప్పే అంటూ మండిపడ్డారు. ఈ విషయానికి ముగింపు పలకాలని తాను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ సూచించారు.

    నిజంగా భువనేశ్వరి అక్క తనను అనరాని మాటలు అని వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావించి ఉంటే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భువనేశ్వరి అనుమతిస్తే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేమంతా కలిసి కన్నీటితో కాళ్లు కడుగుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Also Read: సినిమా టికెట్ ధరలపై నిర్మాతలకు షాకిచ్చిన మంత్రి తలసాని..!