పాపం.. ఉప్మా సినిమాకు బిర్యానీ మాటలెందుకో ?

Republic Movie: దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్‌ సినిమా గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పక్కర్లేదు. సినిమా తీసిన నిర్మాతలు పూర్తిగా నష్టపోయారు. అయితే, ఒక దర్శకుడిగా దేవా కట్టాకు మాత్రం జేబు సంతృప్తి దక్కకపోయినా, జాబు సంతృప్తి దొరికిందని కామెంట్లు వినిపించాయి. దేవా కట్టా కూడా ఆ విషయంలో తాను ఫుల్ హ్యాపీ అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చాడు. అయితే, ‘రిపబ్లిక్’ సినిమా యావరేజ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా, కలెక్షన్స్ రాబట్టలేక […]

Written By: Shiva, Updated On : December 4, 2021 6:33 pm
Follow us on

Republic Movie: దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్‌ సినిమా గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పక్కర్లేదు. సినిమా తీసిన నిర్మాతలు పూర్తిగా నష్టపోయారు. అయితే, ఒక దర్శకుడిగా దేవా కట్టాకు మాత్రం జేబు సంతృప్తి దక్కకపోయినా, జాబు సంతృప్తి దొరికిందని కామెంట్లు వినిపించాయి. దేవా కట్టా కూడా ఆ విషయంలో తాను ఫుల్ హ్యాపీ అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చాడు.

Republic Movie

అయితే, ‘రిపబ్లిక్’ సినిమా యావరేజ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా, కలెక్షన్స్ రాబట్టలేక కిందామీదా పడి చివరకు చేతులు ఎత్తేసినా.. సినిమా రిలీజ్ అయిన ఛాలా చోట్ల నష్టాల ఊబిలో చిక్కుకుని పూర్తిగా నలిగిపోయినా.. ఈ సినిమా గురించి ఓవర్ బిల్డప్ ప్రమోషన్స్ ను మాత్రం ఇంకా ఆపడం లేదు. తాజాగా సాయి తేజ్ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే.. ‘రిపబ్లిక్’ ఏదో పెద్ద ఘనత సాధించిందట.

సరే.. నిజంగానే ఘనత సాధించి గొప్ప విజయం సాధించింది అనుకున్నాం.. ఎక్కడా ఓటీటీలో అట. దానికి లెక్కా పత్రం ఏమి లేవు కాబట్టి.. నోటికొచ్చిన వ్యూస్ కౌంట్ చెప్పుకుని కావాల్సినంత సేపు డప్పు కొట్టుకోవచ్చు. ప్రస్తుతం హీరో సాయి ధరమ్ తేజ్ ఆ పనిలో ఉన్నాడు. ‘తమకు నచ్చినది, ఆశించినది దొరికితే ప్రజానీకం స్పందన ఎలా ఉంటుందో చెప్పిన సినిమా మా రిపబ్లిక్‌’ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.

పనిలో పనిగా తమ బ్లాక్‌ బస్టర్‌ రిపబ్లిక్‌ సినిమా ఏడురోజుల్లోనే 12 కోట్ల వ్యూయింగ్‌ మినిట్స్‌ ను సాధించింది అంటూ సాయి తేజ్ ఒక పోస్టర్‌ను కూడా పోస్ట్ చేశాడు. రిపబ్లిక్‌ సినిమాను ఏ స్థాయిలో జనం తిప్పి కొట్టారో ప్రత్యేకంగా చెప్పాలా ? మొదటి రోజు మార్నింగ్ షోలకు జనం లేని సంగతి మళ్ళీ ముచ్చటించుకోవాలా ? అయినా, తమ సినిమా ఎదో గొప్ప రికార్డును సాధించింది అని చెప్పుకోవడం సొంత డప్పే.

Also Read: రోజూ ఇదే తంతు.. ఎప్పుడు చూసినా కేకలు, అరుపులు !

మరి ఆ డప్పు వల్ల ఎవరికీ ఉపయోగం ? అన్నట్టు సాయి తేజ్ ఇక్కడ ఒక డైలాగ్ కూడా వేశాడు అండి, తమ సినిమాకి లభిస్తున్న ఆదరణకు, వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ కు ధన్యవాదాలు’ అంటూ వినమ్రంగా ఒక కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ఏమిటో పాపం.. ఉప్మా సినిమాకి బిర్యానీ మాటలు. నిజంగానే ఆదరణ బాగుండి ఉంటే.. నిర్మాత మొహంలో సంతోషం విరబూసేది కదా.

Also Read: Saya Saya Song: రొమాంటిక్‌ ‘సయా’.. ఊహించిన దానికంటే బాగుంటుందట !

Tags