Saya Saya Song: కూల్ అండ్ క్లాస్ హీరో నాగశౌర్య హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘లక్ష్య’. విలువిద్య నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉంటాయట. అయితే, తాజాగా ఈ సినిమాలోని సయా సయా అంటూ సాగే క్రేజీ సాంగ్ ను యంగ్ హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్య రిలీజ్ చేశాడు. ఈ ‘సయా’ రొమాంటిక్ లిరికల్ సాంగ్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
సాంగ్ లో లిరిక్స్ తో పాటు నాగశౌర్య – కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ప్రేమలో మునిగి తేలిన ప్రేమికుల మధ్య ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనే కోణంలో మొదలైన ఈ పాటలో కథలోని సందర్భాలను, అలాగే ప్రధాన పాత్రల తాలూకు లవ్ ట్రాక్ ను ఎలివేట్ చేశారు. ఇక కృష్ణకాంత్ ఈ పాటకు అందించిన సాహిత్యం కూడా చాలా బాగుంది.
సరళమైన పదాలలో అర్ధవంతమైన భావాలను అద్ది, చక్కని పల్లవి చరణాలను రాశాడు. ఎమ్‌ఎమ్ కిరవాణి వారసుడు కాల భైరవా ఈ పాట కోసం సమకూర్చిన స్వరాలు కూడా చాలా బాగున్నాయి. డిసెంబర్ 10న థియేటర్లోకి రాబోతోన్న ఈ సినిమాలో కంటెంట్ చాలా బాగుంటుందని, ముఖ్యంగా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయని తెలుస్తోంది.
ఎలాగూ ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. సినిమా పై అంచనాలను భారీగా పెంచింది. పైగా ఈ మధ్య కాలంలో తెలుగులో స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా రాలేదు. అందుకే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా బాగుండటంతో మరింత హైప్ క్రియేట్ అయింది.
Also Read: RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్… పూనకాలకు రెడీ గా ఉండండి అంటూ
మరోపక్క మేకర్స్ కూడా ఈ సినిమా ఊహించిన దానికంటే మరో లెవల్‌లో ఉండబోతుందని చెబుతున్నారు. కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Actress Samantha: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం