Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్

Telangana Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు పక్కా.. బీఆర్ఎస్ 50 స్థానాలకు లోపే పరిమితం అవుతుంది.. బిజెపికు లభించేది సింగిల్ డిజిట్సే.. ఇదంతా విశ్లేషణ కాదు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలో జరుగుతున్న బెట్టింగ్ అంశాలు ఇవి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. దాయాది రాష్ట్రం రాజకీయంపై ఏపీ ప్రజలు ఆసక్తి చూపడం కనిపిస్తోంది. ఈ ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయళ్ళు రంగంలోకి దిగారు. లక్షల రూపాయల పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది.

కెసిఆర్ రెండుచోట్ల గెలుస్తారా? లేకుంటే ఓడిపోతారా? ఆయనకు లభించే మెజారిటీ ఎంత? అన్నదానిపై ఎక్కువగా బ్యాటింగ్ జరుగుతోంది. అటు కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో మెజారిటీ పై సైతం పెద్ద ఎత్తున నగదు జమ చేసి మరి బెట్టింగ్ కొడుతున్నారు. గ్రేటర్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? జనసేన ఎన్ని స్థానాల్లో గెలుపు పొందుతుంది? అన్న అంశాలపై సైతం బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ బెట్టింగ్ పర్వం బలంగా నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? లేకుంటే కేటీఆర్ కు పట్టం కడతారా? కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి వైపు హైకమాండ్ మొగ్గు చూపుతోందా? లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతారా? లేకుంటే భట్టి విక్రమార్కను సీఎం కుర్చి పై కూర్చోబెడతారా? వీటి పైన బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ప్రత్యేక ముఠాలు సైతం రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల్లో ఇదే మాదిరిగా బెట్టింగ్ సాగింది. అప్పట్లో కాంగ్రెస్, టిడిపి కూటమిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ కట్టిన వారికి షాక్ తగిలింది. అందుకే ఈసారి అక్కడ పరిస్థితిని తెలుసుకొని బెట్టింగ్ కడుతున్నారు. లక్షకు పది లక్షలు.. 50 లక్షలకు కోటి రూపాయలు చొప్పున బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను సోషల్ మీడియాను వేదిక చేసుకున్నట్టు సమాచారం. అయితే ఎలక్షన్ బెట్టింగ్ పై పోలీసులు సైతం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version