Telangana Assembly Elections 2023 : ఎన్నికల ప్రచారం ముగిసింది, ఓటర్లు కూడా సిద్ధమయ్యారు

ఎన్నికల ప్రచారం ముగిసింది, ఓటర్లు కూడా సిద్ధమయ్యారు.. తెలంగాణ ఎన్నికల స్థితిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం.

Written By: NARESH, Updated On : November 29, 2023 5:38 pm

Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓ ఘట్టం అయిపోయింది. ఓటర్లు కూడా సిద్ధమయ్యారు. ఇక అన్ డిసైడెడ్ ఓటర్లు చాలా తక్కువ ఉన్నారు. ప్రచారం ముగియడంతో అసలు ఇది ఎలా జరిగింది..? ఏ పార్టీ పాత్ర ఎలా ఉంటుందనే దాని మీద విశ్లేషిద్దాం.

తెలంగాణలో మొట్టమొదట ప్రచారం మొదలుపెట్టింది బీఆర్ఎస్. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి దాదాపు 100 సభల్లో కేసీఆర్ మాట్లాడాడు. అదొక ఎత్తు. అధికార పార్టీకి ఆ మాత్రం ఎడ్వంటేజ్ ఉంటుంది. ప్రతిపక్ష పాత్ర ఏంటి? మొదటి నుంచి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెళ్లింది.

బండి సంజయ్ మార్చడం.. కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేశారు. కానీ బీజేపీ దూకుడైన ప్రచారం.. మోడీ, అమిత్ షా సహా దిగ్గజాలు రాకతో ఇది తప్పని నిరూపితమైంది.

ఎన్నికల ప్రచారం ముగిసింది, ఓటర్లు కూడా సిద్ధమయ్యారు.. తెలంగాణ ఎన్నికల స్థితిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం.