https://oktelugu.com/

Maruti Cars: ఈ కారు కోసం క్యూ కడుతున్నారు.. కారణం ఆ ఫీచర్సే..

దేశీయంగా కార్ల ఉత్పత్తిలో మారుతి అగ్రగామిగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో మోడళ్లు రిలీజ్ అయి వినియోగదారులను ఆకర్షిస్తోంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లలో కార్లను ఉత్పత్తి చేస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : November 29, 2023 / 01:21 PM IST

    Maruti Cars

    Follow us on

    Maruti Cars: కార్లు కొనాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సొంత అవసరాలతో పాటు విహార యాత్రలకు వెళ్లేవారు ప్రత్యేకంగా వెహికల్ ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది కార్ల కోసం సెర్చ్ చేస్తుండడంతో కంపెనీలు వివిధ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దేశీయా కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తున్న మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయినా కొన్ని మోడళ్ల కోసం వినియోగదారులు క్యూడ కడుతున్నారు. అందుకు కారణం అందులోఉండే ఫీచర్సేనని తెలుస్తోంది. ఇంతకీ ఏ కార్లు ది బెస్ట్ గా నిలిచాయి? అందులో ఉండే ఫీచర్స్ ఏంటి?

    దేశీయంగా కార్ల ఉత్పత్తిలో మారుతి అగ్రగామిగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో మోడళ్లు రిలీజ్ అయి వినియోగదారులను ఆకర్షిస్తోంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లలో కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ క్రమంలో మారుతి నుంచి వచ్చిన బాలెనో కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. అలాగే స్విప్ట్, వ్యాగన్ ఆర్, బ్రెజ్జా లు సైతం బెస్ట్ ఫీచర్స్ ను కలిగి ఉండడంతో వీటి విక్రయాలు గణనీయంగా పెరిగాయి.

    మారుతి కంపెనీ సాధారణంగా ప్రతి నెల లక్ష యూనిట్లను విక్రయిస్తోంది. వీటిలో కొన్ని మోడళ్లు అత్యధికంగా విక్రయాలు జరుపుకున్నాయి. గత అక్టోబర్ నెలలో మారుతి స్విప్ట్ 20,598 యూనిట్లు విక్రయించారు. అలాగే వ్యాగన్ ఆర్ 22,080 యూనిట్లు జరుపుకొని ఫస్ట్ ప్లేసులోకి వెళ్లింది. వ్యాగన్ ఆర్ అక్టోబర్ లోనే కాకుండా అంతకుముందు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. వ్యాగన్ ఆర్ రిలీజ్ అయిన తరువాత ఎన్నో మోడళ్లు వచ్చినప్పటికీ దీని ప్రత్యేకత తగ్గకపోవడం విశేషం.

    వీటి విక్రయాలు జరగడానికి ప్రధానంగా ఫీచర్స్ అని వినబడుతోంది. వ్యాగన్ ఆర్ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు 67 పవర్, 89 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్ జీ వేరియంట్ లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కడా కలిగి ఉంది. 5-స్పీడ్ మాన్యువల్, 5- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ఉంది. వ్యాగర్ ఆర్ ను 5.54 లక్షల ప్రారంభ ధర నుంచి 7.42 లక్షల వరకు విక్రయిస్తున్నారు.