Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు దేశంలో ఏ హీరో కూడా చేసి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. కష్టపడి పైకి ఎదిగే విషయం లో కోట్లాది మందికి ఆయన ఎలా అయితే ఆదర్శంగా నిలిచారో, సేవా కార్యక్రమాల్లో కూడా అదే విధంగా ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది హీరోలు సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు. అలాంటి విశాల హృదయమున్న మెగాస్టార్ , రీసెంట్ గానే బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన ‘గబ్బర్ సింగ్’ నటుడు రమేష్ కి ఆర్ధిక సాయం అందించారు. ప్రస్తుతం రమేష్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

రమేష్ ని అపోలో హాస్పిటల్ లో చేర్పించి , ఆయనకు మెరుగైన వైద్యం అందించేలా చేసిందే మెగాస్టార్ చిరంజీవి. రీసెంట్ గానే రమేష్ ఆరోగ్య పరిస్థితి పై అపోలో హాస్పిటల్ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుబ్బారెడ్డి ని రమేష్ ప్రస్తుత పరిస్థితి పై అడిగి , మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరారు. అనంతరం రమేష్ కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించుకొని పరామర్శించిన మెగాస్టార్ , హాస్పిటల్ ఖర్చుల కోసం 3 లక్షల రూపాయిల చెక్ ని అందించారు. అంతే కాకుండా , రాష్ట్ర ప్రభుత్వం తో మాట్లాడి , ఆరోగ్య భీమా ద్వారా రమేష్ వైద్యానికి అవసరమే పూర్తి డబ్బు సమకూరేలా చేస్తానని చిరంజీవి మాట ఇచ్చారు. ఇకపోతే రమేష్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనే విషయాన్ని తెలుసుకున్న వెంటనే మెగా బ్రదర్ నాగబాబు 2 లక్షల రూపాయిల ఆర్ధిక సాయం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు రమేష్ ఆరోగ్య పరిస్థితి ని తెలుసుకుంటూ అతని వైద్యానికి అయ్యే ఆర్ధిక సాయం అందిస్తూనే ఉన్నారు.

కష్టసమయం లో మెగా కుటుంబం రమేష్ కోసం నిలబడిన తీరు అద్భుతం అనే చెప్పాలి. అయితే రమేష్ కేవలం మెగా హీరోల సినిమాల్లోనే కాదు, దాదాపుగా ప్రతీ స్టార్ హీరో సినిమాలో నటించారు. అందరి హీరోలతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందరూ రమేష్ వైద్యానికి అయ్యే ఖర్చు లో ఎంతో కొంత భాగం పంచుకుంటే , ఆయన్ని సాధ్యమైనంత తొందరగా కాపాడొచ్చు. గతం లో ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమించినప్పుడు ఇండస్ట్రీ నుండి సరైన రెస్పాన్స్ రాలేదు , ఫలితంగా ఆయన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది, మళ్లీ అలాంటి పరిస్థితి రాకముందే , సినీ హీరోలు రమేష్ కి ఆర్ధిక సాయం అందిస్తే బాగుంటుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కోరుతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Oktelugu Epaper
Exit mobile version