జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. డిసెంబర్ 1న 149 డివిజన్లలో.. డిసెంబర్ 3న ఓల్డ్ మలక్ పేట డివిజన్లో పోలింగ్ జరిగింది. నేడు ఫలితాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్.. బీజేపీ పార్టీలు నువ్వా.. నేనా అన్నట్లుగా గ్రేటర్లో తలపడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించగా.. తొలి రౌండ్ ఫలితాల్లో మాత్రం టీఆర్ఎస్ దూసుకెళుతోంది.
Also Read: తొలి రౌండ్లో దూసుకెళుతున్న కారు.. యూసఫ్ గూడలో బోణికొట్టిన టీఆర్ఎస్..!
ఇప్పటికే పలు డివిజన్లో ఫలితాలు వెలువడ్డాయి. మోహదిపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ బోణి కొట్టాడు. ఈ ఫలితం తర్వాత యూసఫ్ గూడ ఫలితం వెలువడింది. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ గెలుపొంది ఆ పార్టీ నుంచి ఖాతా తెరిచాడు. అలాగే మెట్టు గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.సునీత.. దబీర్‌పూరలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్ ఖాన్ గెలుపొందాడు. ఎస్ఆర్ రావు నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషా రెడ్డి గెలుపొందారు.
ఓవైపు ఫలితాలు వెలువడుతుండగా మరోవైపు బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు డివిజన్లలో టీఆర్ఎస్.. బీజేపీలపై బెట్టింగ్ రాయుళ్లు పందాలను కాస్తున్నారు. నగరం నడిబొడ్డులోని స్టార్ హోటల్స్.. క్లబ్ల్లో ఉన్నతస్థాయి వ్యక్తులు లక్షల్లో బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు తెల్సింది. ప్రధానంగా నగర శివారల్లోని డివిజన్లలో టీఆర్ఎస్ పై.. సిటీలో బీజేపీపై.. పాతబస్తీలో ఎంఐఎంపై పందాలు కాస్తున్నట్లు సమాచారం.
Also Read: గ్రేటర్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్..!
ఫలితాలు ఉత్కంఠగా వస్తుండటంతో బెట్టింగ్ రాయుళ్ల గుండెల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల అభిమానులు తమ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ పందాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డబ్బులన్నీ మధ్యవర్తుల మధ్య భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా గ్రేటర్లో ఎన్నికల ఫలితాలపై లక్షల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు గమనార్హం.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్