https://oktelugu.com/

విజయ్ సేతుపతితో అనసూయ.. వైరల్ అవుతోన్న ఫోటో !

జబర్థస్త్ యాంకర్‌ గా అందాలను పరిచి ఫుల్ క్రేజ్ సంపాదించింది ఆల్ టైం హాట్ యాంకర్ ‘అనసూయ’. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ సంపాదించి బాగా బిజీ అయిపోయింది. కాగా తాజాగా అనసూయ విజయ్ సేతుపతితో కలిసి ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఫోటోలో అనసూయ నవ్వులు చిందిస్తూ విజయ్ సేతుపతిని ఏదో ఆట పట్టిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఈ హాట్ బ్యూటీని […]

Written By:
  • admin
  • , Updated On : December 4, 2020 / 12:50 PM IST
    Follow us on


    జబర్థస్త్ యాంకర్‌ గా అందాలను పరిచి ఫుల్ క్రేజ్ సంపాదించింది ఆల్ టైం హాట్ యాంకర్ ‘అనసూయ’. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ సంపాదించి బాగా బిజీ అయిపోయింది. కాగా తాజాగా అనసూయ విజయ్ సేతుపతితో కలిసి ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఫోటోలో అనసూయ నవ్వులు చిందిస్తూ విజయ్ సేతుపతిని ఏదో ఆట పట్టిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఈ హాట్ బ్యూటీని అనసూయ సినిమా ప్రాజెక్ట్ విషయంలో కలిసిందా ? లేదా తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనసూయనే వెళ్లి కలిసిందా? అన్నది తెలియడం లేదు గాని.. మొత్తానికి ఫోటో అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

    Also Read: ప్రభాస్ అమాయకుడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ !

    ఇక ఒక వైపు యాంకరింగ్ తో అండ్ యాక్టింగ్ తో ఫుల్ బిజీగా ఉంటూ రెండు చేతులా సంపాదిస్తున్న ఈ భారీ బ్యూటీ తమిళ హీరోలతో కూడా బాగానే రిలేషన్ ను మెయింటైన్ చేస్తోంది. ఇక అనసూయ గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది.

    నిర్మాతగా ఒక హాట్ వెబ్ సిరీస్ చేయడానికి సన్నద్ధం అవుతుందట అనసూయ. కాగా ఇప్పటికే కథ కూడా ఫైనల్ చేసిందట. పైగా వెబ్ సిరీస్ లో తానే నటిస్తోందని కూడా తెలుస్తోంది. మరి తన వెబ్ సిరీస్.. పైగా మొదటది. సో.. ఓ రేంజ్ లో హాట్ హాట్ అందాలతో కనువిందు చేయడం ఖాయం అనే టాక్ బాగా వినిపిస్తోంది ఫిల్మ్ సర్కిల్స్ లో. ఏమైనా నటిగా కంటెంట్ ఉన్న కథల్ని ఎంపిక చేసుకుంటూనే గ్లామర్ ను చూపిస్తున్న అనసూయ.. వెబ్ మూవీస్‌ ను నిర్మించడానికి ‘అనసూయ పిక్చర్స్’ అనే బ్యానర్‌ ని కూడా పెట్టుకోవడం విశేషం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్