https://oktelugu.com/

మంత్రి కొడుకు బెంజి కారు వివాదంలో కీలక మలుపు

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసినా అధికార వైసీపీ మంత్రి కొడుకు ‘బెంజ్ కారు’ గిఫ్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఏపీ మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారు గిఫ్ట్ గా వచ్చిందని.. ఈఎస్ఐ స్కాంలో ఏ14గా ఉన్న వ్యక్తి నుంచి ఇది అందిందని ఇటీవల ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు  చేసిన విమర్శలు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి.. ఈ వివాదంలో కేంద్రబిందువైన ఈఎస్ఐ స్కాంలో ఏ14గా ఉన్న కార్తీక్ తాజాగా స్పందించారు. Also […]

Written By: , Updated On : September 19, 2020 / 04:17 PM IST
benz car

benz car

Follow us on

benz car

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసినా అధికార వైసీపీ మంత్రి కొడుకు ‘బెంజ్ కారు’ గిఫ్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఏపీ మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారు గిఫ్ట్ గా వచ్చిందని.. ఈఎస్ఐ స్కాంలో ఏ14గా ఉన్న వ్యక్తి నుంచి ఇది అందిందని ఇటీవల ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు  చేసిన విమర్శలు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి.. ఈ వివాదంలో కేంద్రబిందువైన ఈఎస్ఐ స్కాంలో ఏ14గా ఉన్న కార్తీక్ తాజాగా స్పందించారు.

Also Read: తిరుమల డిక్లరేషన్ వివాదం… చంద్రబాబు, రఘురామ తీవ్ర విమర్శలు?

కాగా ఈ ఆరోపణలపై   ఏపీ మంత్రి జయరాం, ఆయన కుమారుడు స్పందించారు.   ఆ కారుకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన కుమారుడి పేరున కారు ఉంటే తాను రాజీనామా చేస్తానని మంత్రి జయరాం  సవాల్ విసరడం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది.

దీంతో ఈ వివాదానికి కేంద్ర బిందువైన ఏ14గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీక్ బయటకు వచ్చాడు.  గత ఏడాది డిసెంబర్ లో తాను బెంజ్ కారును కొన్నానని..తనకు మంత్రి కుమారుడు ఈశ్వర్ స్నేహితుడని.. స్నేహంలో భాగంగా మాత్రమే కొత్త కారును ఈశ్వర్ నుంచి తాను తీసుకున్నానని కార్తీక్  తెలిపారు. బెంజ్ కారు తాను ఎవరికీ బహుమతిగా ఇవ్వలేదన్నారు.

తనపై ఈఎస్ఐ స్కాం కేసు 2020 ఏప్రిల్ లో నమోదైందన్నారు. తనను జులైలో ఏసీబీ అరెస్ట్ చేసిందని.. ఈఎంఐ చెల్లించకపోవడంతో కారును సీజ్ చేశారని కార్తీక్ తెలిపారు. ప్రస్తుతం ఆ కారు హైదరాబాద్ లోని ఫైనాన్స్ కంపెనీ వారి ఆధీనంలో ఉందన్నారు.మంత్రికి కారు బహుమతిగా ఇస్తే ఆ కారు అక్కడ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.

బెంజి కారును తాను మంత్రి కొడుకుకు గిఫ్ట్ ఇచ్చాను అనే వార్తలు అసత్య ఆరోపణలు అని నిజం కాదని కార్తీక్  తెలిపారు… తనకు మంత్రి కొడుకు స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు.

Also Read: జగన్ సార్… రైతుల కష్టాలు కనిపిస్తున్నాయా..?

దీంతో టీడీపీ ఆరోపణలు వట్టివేనని తేలింది. కార్తీక్ చెప్పింది కనుక నిజమైతే మాజీ మంత్రి అయ్యన్న ఆరోపణలు వట్టి మాటలని తెలుస్తోంది. మరి కార్తీక్ చెప్పింది నిజమా కాదా అన్నది తేలాల్సి ఉంది.