https://oktelugu.com/

ప్లాప్ హీరోకి బంపర్ ఆఫర్ !

డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా హీరో అయి, కొన్నాళ్ళు పాటు ఫామ్ లో ఉన్న యంగ్ హీరో ‘రాజ్‌ తరుణ్‌’ ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడి, చివరకు అవకాశాలను కూడా అందుకోలేకపోతున్నాడు. ఒక విధంగా గత కొంతకాలంగా హిట్ కోసం పడిగాపులు కాస్తున్నాడు. అయితే, రాజ్ తరుణ్ కి ఒక బంపర్ ఆఫర్ తగిలింది. రైటర్ కోన వెంకట్ నిర్మించబోతున్న సినిమాలో రాజ్ తరుణ్ ను హీరోగా […]

Written By:
  • admin
  • , Updated On : September 19, 2020 / 04:12 PM IST
    Follow us on


    డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా హీరో అయి, కొన్నాళ్ళు పాటు ఫామ్ లో ఉన్న యంగ్ హీరో ‘రాజ్‌ తరుణ్‌’ ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడి, చివరకు అవకాశాలను కూడా అందుకోలేకపోతున్నాడు. ఒక విధంగా గత కొంతకాలంగా హిట్ కోసం పడిగాపులు కాస్తున్నాడు. అయితే, రాజ్ తరుణ్ కి ఒక బంపర్ ఆఫర్ తగిలింది. రైటర్ కోన వెంకట్ నిర్మించబోతున్న సినిమాలో రాజ్ తరుణ్ ను హీరోగా అనుకుంటున్నారట. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హాట్ అయిన రీమేక్ ఫిల్మ్ అట. రాజ్ తరుణ్ హీరోగా ఈ సినిమా ఓకె అయిందని.. ఈ సబ్జెక్ట్ లో హీరో జులాయిగా కనిపిస్తాడని.. మెడికల్ బ్యాక్ గ్రౌండ్ లోని లొసుగులను ఈ కథలో ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది.

    Also Read: టాలెంటెడ్ హీరోయిన్ డైరెక్షన్ చేస్తానంటుంది !

    మొదట ఈ కథ సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్ళింది. అయితే ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడంతో సాయి తేజ్ వరుస సినిమాలను సెట్ చేసుకున్నాడు. ప్రసుతం సెట్ మీద ఒక సినిమా ఉంది, అలాగే కరోనా అనంతరం మరొకటి సెట్ మీదకు వెళ్లనుంది. ఇవి కాకుండా ఆల్ రెడీ మరో కథను ఓకే చేశాడు. ఇన్ని సినిమాలను చేతిలో ఉండటంతోనే.. కోన వెంకట్ తెచ్చిన ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. మొదట సినిమా చేయాలనుకున్నా, కరోనా అనంతరం దేవా కట్టా డైరక్షన్ లో సాయి తేజ్ ఓ థ్రిల్లర్ సినిమా చేయనున్నాడు.

    Also Read: రియల్ హీరో అనిపించుకున్న ‘మెగా హీరో’

    ఈ సినిమాకి భగవాన్ పుల్లారావు నిర్మాత.. ఇప్పటికే పుల్లారావ్ ఈ సినిమాని నవంబర్ నుండి లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆ తరువాత బివివిఎస్ఎన్ ప్రసాద్ కి సాయి తేజ్ మళ్లీ మరో సినిమా చేయాల్సి ఉంది. వీటన్నిటి మధ్యలో కోన వెంకటే సినిమాకి డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోయాడు. ఆ కారణంగా ఈ సినిమా రాజ్ తరుణ్ దగ్గరకు వచ్చింది. ప్రసుతం కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ‘ఒరేయ్ …బుజ్జిగా’ అనే సినిమాలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్లాప్ అయితే రాజ్ తరుణ్ ఇక హీరోగా కొనసాగడం కష్టమే.