https://oktelugu.com/

50 ఏళ్లుగా పిల్లలు పుట్టని శాపగ్రస్తమైన గ్రామం వింతలు తెలిస్తే షాక్ ..

ఆ గ్రామంలో అసలు పిల్లలు పుట్టరు.. పుట్టడాన్ని కూడా ఆ గ్రామంలో ఒప్పుకోరు..  ఇక్కడ గత 50 ఏళ్ళుగా ఒక బిడ్డ కూడా పుట్టలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది..? ఏంటా సంగతులో తెలుసుకుందాం..  Also Read: టాలెంటెడ్ హీరోయిన్ డైరెక్షన్ చేస్తానంటుంది ! ఎన్నో వింతలు విశేషాలకు నెలవైన ఈ గ్రామం మధ్యప్రదేశ్ లో భోపాల్ కి 70 కిమీల దూరంలో ఉంది. ఇదేం ప్రసిద్ధి చెందిన స్థలం కాదు, ఇక్కడ […]

Written By: , Updated On : September 19, 2020 / 04:23 PM IST
madhyapradesh village

madhyapradesh village

Follow us on

madhyapradesh village
ఆ గ్రామంలో అసలు పిల్లలు పుట్టరు.. పుట్టడాన్ని కూడా ఆ గ్రామంలో ఒప్పుకోరు..  ఇక్కడ గత 50 ఏళ్ళుగా ఒక బిడ్డ కూడా పుట్టలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది..? ఏంటా సంగతులో తెలుసుకుందాం.. 

Also Read: టాలెంటెడ్ హీరోయిన్ డైరెక్షన్ చేస్తానంటుంది !

ఎన్నో వింతలు విశేషాలకు నెలవైన ఈ గ్రామం మధ్యప్రదేశ్ లో భోపాల్ కి 70 కిమీల దూరంలో ఉంది. ఇదేం ప్రసిద్ధి చెందిన స్థలం కాదు, ఇక్కడ జనాభా కూడా కేవలం పెద్దవారు, వృద్ధులు మాత్రమే. గ్రామం యొక్క చరిత్రను స్థానికులు కథలు కథలుగా చెబుతారు..  
 
ఇక్కడ శ్రీకృష్ణుడి గుడి ఒకటి ఉండేది. గ్రామంలో పవిత్రతను నిలిపి ఉంచడానికి, పూజారి గ్రామం వెలుపలే పురుడు పోసుకోవాలని ఎన్నో ఏళ్ల క్రితం సూచించారట. ఇక అప్పటినుంచి అదే సంప్రదాయం కొనసాగుతోంది. యుక్తవయసు వచ్చిన వారందరూ గ్రామం నుంచి పక్క ఊళ్లకు పట్నాలకు పోయి అక్కడే పురుడు పోసుకొని జీవిస్తారట.. వారి గ్రామంలో పిల్లలు పుడితే, వారు బతకరని, వెంటనే తొందరగా చనిపోతారనే గ్రామస్థుల అభిప్రాయం చాలా ఏళ్లుగా గట్టిగా పాతుకుని ఉంది. వారి నమ్మకం ప్రకారం ఆ బిడ్డ వికలాంగులుగానే పుడతారు కూడా. 

Also Read: రియల్ హీరో అనిపించుకున్న ‘మెగా హీరో’

ఇక్కడ గ్రామపెద్ద వయస్సు 50 ఏళ్ళకి పైమాటే. ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్లనుంచి ఇక్కడ పిల్లలు పుట్టడాన్ని కనీ,వినీ ఎరగలేదని చెప్పారు. అందుకే పిల్లలు పుట్టని ఈ గ్రామం ఇప్పటికీ దేశంలో ఒక్కటే ఉండి ఆసక్తి రేపుతోంది.