ఉత్తరాఖాండ్‌ ప్రళయం భారీదే..: శాటిలైట్‌ దృశ్యాలు వెలుగులోకి..

హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్‌ జల ప్రళయంగా మారింది. చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. దీంతో తపోవన్‌–రేణిలో ఎన్‌టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. Also Read: కేంద్రానికి షాకిచ్చిన ట్విట్టర్.. ప్రజలకు వాయిస్ ఉత్తరాఖండ్‌లోని చమోలీలో కొండచరియలు విరిగిపడి ఈ విపత్తులో ఇప్పటివరకూ 26 మంది మృతి చెందారని తెలుస్తోంది. దీనితోపాటు 187 మంది […]

Written By: Srinivas, Updated On : February 9, 2021 4:41 pm
Follow us on


హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్‌ జల ప్రళయంగా మారింది. చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. దీంతో తపోవన్‌–రేణిలో ఎన్‌టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది.

Also Read: కేంద్రానికి షాకిచ్చిన ట్విట్టర్.. ప్రజలకు వాయిస్

ఉత్తరాఖండ్‌లోని చమోలీలో కొండచరియలు విరిగిపడి ఈ విపత్తులో ఇప్పటివరకూ 26 మంది మృతి చెందారని తెలుస్తోంది. దీనితోపాటు 187 మంది జాడ ఇంకా తెలియడం లేదు. ఈ విపత్తు కారణంగా తపోవన్ సమీప ప్రాంతాలు పూర్తిగా చిన్నాభిన్నం అయ్యాయి. కాగా.. ఈ ప్రళయానికి ముందు.. కొండచరియలు విరిగిపడిన తరువాతి శాటిలైట్ దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

ఈ దృశ్యాలను చూస్తే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే అర్థమవుతోంది. ప్లానెట్ ల్యాబ్స్ ఇంక్ విడుదల చేసిన ఈ శాటిలైట్ దృశ్యాలు అక్కడి బీభత్స వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఈ ప్రళయానికి ముందు అంటే ఫిబ్రవరి 6న కొండచరియలు సాధారణంగానే కనిపిస్తున్నాయి. అలాగే ఫిబ్రవరి 7న కొండ చరియలు విరిగిపడిన దృశ్యం కనిపిస్తోంది. దీనితోపాటు థౌలిగంగ నదిలో పెరిగిన వరద ఉధృతి, ఎగసిపడుతున్న దుమ్ము, ధూళి కనిపిస్తున్నాయి. ఈ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా భూమి సద్దుబాట్ల కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నిపుణులు భావిస్తున్నారు.

Also Read: ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో ఎందుకింత నిర్లక్ష్యం

ప్రళయ గంగమ్మ ధాటికి విలవిల్లాడిన ఉత్తరాఖండ్ తేరుకోలేదు. గంగా ఉపనది ధౌలి గంగ ఉప్పెనలా ముంచెత్తిన ఘటనలో రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. తపోవన్ -విష్ణుగఢ్ ప్రాజెక్ట్ దగ్గర హెడ్ రేస్ టన్నెల్(హెచ్ఆర్టీ)లో 30-–35 మంది కార్మికులు చిక్కుకున్నారు. వందలాది మంది సిబ్బంది, బురదను తొలగించే పనిలో ఉన్నారు. ‘టన్నెల్‌లో చిక్కుకున్న వర్కర్లను కాపాడేందుకు మా టీమ్స్ ఆదివారం రాత్రి నుంచి పని చేస్తున్నాయి. స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ పంపాం. అందరినీ కాపాడగలమని భావిస్తున్నాం. టన్నెల్లో భారీగా నురగ, బురద, చెత్త పేరుకుపోయింది. 100 మీటర్ల దాకా క్లియర్ చేశారు. ఇంకా 100 మీటర్ల మేర శిథిలాలు తొలగించాల్సి ఉంది”అని ఐటీబీపీ స్పోక్స్పర్సన్ తెలిపారు.

ధౌలి గంగా రివర్ వ్యాలీ ఎటు చేసినా మొత్తం బురదతో నిండిపోయింది. చాలా నిర్మాణాలు కొట్టుకుపోయాయి. మరెన్నో బురద కింద కప్పబడిపోయాయి. టన్నెళ్లు కూడా బురద, నురగ, శిథిలాలతో నిండిపోయాయి. టన్నెళ్లలో చిక్కుకున్న వారిని గుర్తించి, కాపాడేందుకు స్నిఫర్ డాగ్స్, బుల్డోజర్లు, జేసీబీలను అక్కడికి తెప్పించారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్