కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుండగా ఆ పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున మూడు విడతల్లో కేంద్రం రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులను జమ చేస్తోంది. మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ నగదు జమవుతుంది. అయితే ఇకపై కొంతమంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రావని తెలుస్తోంది.
Also Read: కేంద్రం కొత్త నిబంధనలు.. వారానికి నాలుగు రోజులే పని..?
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించిన నిబంధనలలో కీలక మార్పులు చేసింది. ఇకపై రైతులు ఈ స్కీమ్ కు అర్హత పొందాలంటే పొలం రైతు పేరుపై ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తూ ఆ పొలం అతని తల్లిదండ్రుల పేరుపై ఉంటే కూడా పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించిన నగదును పొందడం సాధ్యం కాదు. రైతులు పొలం కౌలుకు తీసుకున్నా ఆ పంటపై పీఎం కిసాన్ స్కీమ్ నగదును పొందలేరు.
Also Read: రైతులకు మరో శుభవార్త చెప్పిన మోదీ సర్కార్.. ఏంటంటే..?
ఇంట్లో ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా లేదా 10 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెన్షన్ తీసుకున్నా పీఎం కిసాన్ నగదును పొందలేరు. రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ అప్లికేషన్ ను ఓకే చేస్తే మాత్రమే ఈ స్కీమ్ యొక్క డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇకపై పీఎం కిసాన్ స్కీమ్ లో కొత్తగా చేరేవారికి ఈ నియమనిబంధనలు వర్తిస్తాయని ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారికి ఈ నిబంధనలు వర్తించవని తెలుస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
కేంద్రం అమలులోకి తెచ్చిన నిబంధనల వల్ల కొంతమంది రైతులు వ్యవసాయం చేసినా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ నగదును ఈ ఏడాది నుంచి పెంచే అవకాశం ఉందని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాదని తేలింది.