https://oktelugu.com/

కేంద్రానికి షాకిచ్చిన ట్విట్టర్.. ప్రజలకు వాయిస్

మొన్నటికి మొన్న ట్విట్టర్‌‌కు షాక్‌ ఇచ్చిన కేంద్రానికి ట్విట్టర్‌‌ రిటర్న్ గిఫ్ట్‌ ఇచ్చింది. రైతుల ఉద్యమంపై దుష్ప్రచారం చేస్తున్నారని.. మొత్తం 1,158 ఖాతాలను నిలిపివేయాలని ట్విట్టర్ ఇండియాను కేంద్రం సోమవారం ఆదేశించింది. ఈ అంశంపై ట్విట్టర్ స్పందిస్తూ.. తమ ఉద్యోగుల భద్రతే సంస్థ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ‘ట్విట్టర్‌లో మా ఉద్యోగుల భద్రత మాకు ప్రధానం. మేము గౌరవప్రదమైన స్థానం నుంచి భారత ప్రభుత్వంతో నిమగ్నమై ఉన్నాం.. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రితో […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 9, 2021 / 02:45 PM IST
    Follow us on


    మొన్నటికి మొన్న ట్విట్టర్‌‌కు షాక్‌ ఇచ్చిన కేంద్రానికి ట్విట్టర్‌‌ రిటర్న్ గిఫ్ట్‌ ఇచ్చింది. రైతుల ఉద్యమంపై దుష్ప్రచారం చేస్తున్నారని.. మొత్తం 1,158 ఖాతాలను నిలిపివేయాలని ట్విట్టర్ ఇండియాను కేంద్రం సోమవారం ఆదేశించింది. ఈ అంశంపై ట్విట్టర్ స్పందిస్తూ.. తమ ఉద్యోగుల భద్రతే సంస్థ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ‘ట్విట్టర్‌లో మా ఉద్యోగుల భద్రత మాకు ప్రధానం. మేము గౌరవప్రదమైన స్థానం నుంచి భారత ప్రభుత్వంతో నిమగ్నమై ఉన్నాం.. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రితో అధికారిక చర్చల కోసం చేరుకున్నాం’ అని ట్విట్టర్ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు.

    Also Read: ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో ఎందుకింత నిర్లక్ష్యం

    ప్రభుత్వం నుంచి నోటీసు అందినట్టు ట్విట్టర్ అంగీకరించింది. పాకిస్థాన్, ఖలిస్థాన్ సానుభూతిపరులకు చెందిన 1,178 ఖాతాలను తొలగించాలని ప్రభుత్వం ట్విట్టర్‌ను కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ ఉత్తర్వులను ఆ సంస్థ ఇంకా పూర్తిగా పాటించలేదని వారు చెప్పారు. ‘బహిరంగ, స్వేచ్ఛాయూత సమాచార మార్పిడి సానుకూల ప్రభావాన్ని చూపుతుందని మేం బలంగా నమ్ముతున్నాం.. ట్వీట్లు నిరంతరం ప్రవాహంలా ఉండాలి’ అని కంపెనీ ప్రతినిధి తాజా ప్రకటనలో తెలిపారు.

    Also Read: తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

    ‘సంస్థ అటువంటి నివేదికలకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటుంది. అయితే, దాని ప్రాథమిక విలువలు, ప్రజా సంభాషణలను రక్షించడంలో నిబద్ధతకు కట్టుబడి ఉంది’ అని స్పష్టం చేసింది. ‘ఖలీస్థాన్ సానుభూతిపరులు లేదా పాకిస్థాన్ మద్దతుతో విదేశీ భూభాగాల నుంచి పనిచేసే ఉగ్రవాదులకు చెందిన చాలా ఖాతాలు రైతుల నిరసనలపై తప్పుడు సమాచారం.. రెచ్చగొట్టే విషయాలను పంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు’ అంటూ నోటీసుల్లో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్