అంబానీకి షాక్.. ఆస్తుల అమ్మకానికి బ్యాంకులు సిద్ధం!

అన్న ఏమో అపరకుబేరుడు.. దేశంలోనే నంబర్ 1 ధనవంతుడు.. తమ్ముడేమో అప్పుల కుప్పలో మునిగిపోయాడు. తన భార్య సంపాదనతోనే బతుకీడుస్తున్నాడు. దేశంలోనే సంపన్న కుటుంబమైన అంబానీల కథ ఇదీ.. ధీరుబాయ్ అంబానీ వారసులు.. రిలయన్స్ సంస్థ సోదరులు ఇద్దరూ ఒకే అడుగు వేసినా ఒకరేమో అందలమెక్కారు. మరొకరు ఏమో అథ: పాతాళానికి పడిపోయారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు విడిపోయి వ్యాపారాలు పంచుకొని ముందుకెళ్లారు. కానీ కట్ చేస్తే అన్న ముఖేష్ దేశంలోనే సంపన్నుడిగా ఎదగగా.. అప్పులతో […]

Written By: NARESH, Updated On : November 3, 2020 10:01 am
Follow us on

anil ambani

అన్న ఏమో అపరకుబేరుడు.. దేశంలోనే నంబర్ 1 ధనవంతుడు.. తమ్ముడేమో అప్పుల కుప్పలో మునిగిపోయాడు. తన భార్య సంపాదనతోనే బతుకీడుస్తున్నాడు. దేశంలోనే సంపన్న కుటుంబమైన అంబానీల కథ ఇదీ.. ధీరుబాయ్ అంబానీ వారసులు.. రిలయన్స్ సంస్థ సోదరులు ఇద్దరూ ఒకే అడుగు వేసినా ఒకరేమో అందలమెక్కారు. మరొకరు ఏమో అథ: పాతాళానికి పడిపోయారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు విడిపోయి వ్యాపారాలు పంచుకొని ముందుకెళ్లారు. కానీ కట్ చేస్తే అన్న ముఖేష్ దేశంలోనే సంపన్నుడిగా ఎదగగా.. అప్పులతో తమ్ముడు అనిల్ అంబానీ ఇప్పుడు దివాలా తీసి ఇప్పుడు ఘోర అవమానం ముగింట నిలబడ్డాడు. .

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

అనిల్ అంబానీ నుంచి బ్యాంకుల నుంచి తీసుకున్న దాదాపు 20వేల కోట్ల రూపాయల బకాయిల కోసం కీలక ఆస్తులను విక్రయించే ప్రక్రియను ప్రారంభించామని సీఎన్.బీసీ నివేదించింది. కాగా రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చిన అతిపెద్ద బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి. ఎస్.బీ.ఐ సహా జాతీయ బ్యాంకులు కూడా భారీగానే అప్పులు ఇచ్చారు. ఇప్పుడు అనిల్ అంబానీ దివాళా తీయడంతో ఆయన ఆస్తులు అమ్మి వాటితో రుణాలు తీర్చడానికి బ్యాంకులు రెడీ అయ్యారు.

Also Read: తెలంగాణలో రాష్ట్రపతి పాలన.! హెచ్చరించిన బీజేపీ

అనిల్ అంబానీకి ఈ పరిణామం బిగ్ షాక్ గా చెప్పవచ్చు. అనిల్ అంబానీ చేసిన రుణ బకాయిలను రాబట్టడానికి బ్యాంకులు ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసి ఆయన ఆస్తుల అమ్మకానికి రెడీ అయ్యాయి. దేశ పరిశ్రమ వర్గాల్లో ఈ చర్య చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఓటుకు నోటు కేసు: ఎమ్మెల్యే సండ్రకు కోర్టులో గట్టి షాక్

అనిల్ అంబానీ నేతృత్వంలోని ‘రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (ఆర్సీఎల్)’ ఆస్తుల విక్రయానికి బ్యాంకులు ఆసక్తి ఉన్న వారి నుంచి బిడ్లను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ బిడ్లను సమర్పించేందుకు తుది గడువు 2020 డిసెంబర్‌ 1 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ అనుబంధ సంస్థలలో ఆర్‌సిఎల్ వాటాల్లో కొంత భాగానికి లేదా మొత్తం విక్రయించనుంది