
సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికి గ్లౌజులు, మాస్కులు అందజేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం ఓటు హక్కు కల్పిస్తున్నారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో ఓటేశారు. అలాగే కరోనా నేపథ్యంలో వైద్య సిబ్బందిని, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. అన్ని నియోజకవర్గ పరిధిలో పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేశారు.