https://oktelugu.com/

Bandla Ganesh: వైసీపీ నేతల ‘రెడ్డి కామెంట్స్’కు దిమ్మిదిరిగి పోయే కౌంటరిచ్చిన బండ్ల గణేశ్.. త‌గ్గేదే లే..

Bandla Ganesh: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజా రాజకీయ, సామాజిక, సినిమాతో పాటు ఇతర విషయాలపైన స్పందిస్తుంటారు. తాజాగా వైసీపీ నేతలు చేసిన రెడ్డి కామెంట్స్‌కు బండ్ల గణేశ్ వాళ్ల దిమదిరిగిపోయే కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు బండ్ల గణేశ్ ను తెగ పొగిడేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల వైసీపీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 11, 2022 / 05:02 PM IST

    bandla ganesh

    Follow us on

    Bandla Ganesh: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజా రాజకీయ, సామాజిక, సినిమాతో పాటు ఇతర విషయాలపైన స్పందిస్తుంటారు. తాజాగా వైసీపీ నేతలు చేసిన రెడ్డి కామెంట్స్‌కు బండ్ల గణేశ్ వాళ్ల దిమదిరిగిపోయే కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు బండ్ల గణేశ్ ను తెగ పొగిడేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

    Bandla Ganesh

    ఇటీవల వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ‘పుష్ప’ఫిల్మ్ నిర్మాతలు కావాలనే రెడ్లను విలన్లుగా చూపిస్తున్నారని విమర్శించారు. కాగా, ఈ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ సినీ ఇండస్ట్రీ తరఫున బలమైన కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు.

    Also Read: 2014 ఎన్నిక‌ల సీన్ రిపీట్ కానుందా.. ఏపీలో ఈసారి ప‌వ‌న్ పోటీ చేసేది అక్క‌డి నుంచే..

    ఓ టీవీ చానల్ డిబేట్‌లో వైసీపీ నేత రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ రెడ్లను కావాలనే విలన్లుగా చూపిస్తున్నారని, అలా ‘పుష్ప’మూవీలో ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కొండారెడ్డి, జక్కారెడ్డి, జాలిరెడ్డి అని పెట్టారని, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారు అలా చంద్రబాబు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. దాంతో బండ్ల గణేశ్ గతంలో బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ సినిమాతో హీరోయిజం ఎలివేట్ చేశాడని, ఆ చిత్ర దర్శకుడు, హీరో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని గుర్తు చేశారు.

    ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ పిక్చర్‌లో ఇంద్రసేనారెడ్డి పాత్ర పోషించారని, ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కమ్మ సామాజిక వర్గం, చిరంజీవి కాపు సామాజిక వర్గానికి చెందిన వారని వివరించాడు. అదే చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ పేరుతో సినిమా తీసినప్పుడు వైసీపీ నేతలకు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని బండ్ల గణేశ్ ప్రశ్నించాడు. అలా స్టోరికి అనుగుణంగా పాత్రలు పేర్లుంటాయని, భావజాల వ్యాప్తికి సంబంధించిన అంశాలు అందులో ఉండబోవని బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక బండ్ల గణేశ్ ఇచ్చిన కౌంటర్స్ చూసిన నెటిజన్లు.. వైసీపీ నేతలకు దిమ్మదిరిగిపోయే కౌంటర్ ఇచ్చారని ప్రశంసిస్తున్నారు.

    Also Read:  సంక్రాంతి చిత్రాలివే.. మరి బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?

    Tags