AP Politics: ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గం కుప్పంలో పట్టు సాధించి రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. ఇక బీజేపీ కూడా జోరు పెంచింది. ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ సైతం తనదైన వ్యూహాలు రచించుచకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ తాను 2024 ఎన్నికల్లో పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానాలపైన కూడా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉన్నప్పటికీ అప్పుడే రాజకీయ పార్టీల పొత్తుల గురించి వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్‌తో పొత్తుకు తాము రెడీ అన్నట్లు చంద్రబాబు సంకేతాలు పంపుతున్నారు. ఒకవేళ పొత్తుకు పవన్ కల్యాణ్ ఒప్పుకుంటే ఆటోమేటిక్ గా బీజేపీ కూడా పొత్తులో ఉంటుంది. అలా మళ్లీ 2014 ఎన్నికల నాటి పరిస్థితులు రిపీట్ అయి.. 2024 ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలనే ప్లాన్ ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, పవన్ కల్యాణ్ గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి సొంతంగా ఎదగాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఈ సారి తాను పోటీ చేసే స్థానాల పైన స్పష్టతతో జనసేనాని పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారని వినికిడి.
Also Read: మేఘాలు ఎంత బరువు ఉంటాయి.. వాటిని ఎలా లెక్కిస్తారో తెలుసా?
గతంలో పోటీ చేసిన స్థానాలు కాకుండా ఈ సారి మార్పు ఉంటుందనే ఊహాగానాలున్నాయి. 2019 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఈ సారి పవన్ పోటీ చేయబోయే స్థానాల మార్పు ఉంటుందని వార్తలొస్తున్నాయి.
కాకినాడ అర్బన్, రూరల్ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రెండు స్థానాల్లో పవన్ కల్యాణ్ మద్దతుదారులు ఉండటంతో పాటు పార్టీ కూడా బలంగా ఉందని అంటున్నారు. అలా కాకుండా తిరుపతి, అనంతపురం నుంచి కూడా పోటీ చేయాలని పవన్ అనుకుంటున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. చూడాలి మరి.. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో..
Also Read: పరిటాల శ్రీరామ్ పోటీచేసేది అక్కడి నుంచేనట?