Isha Chawla: కరోనా ఖాతాలో మరో బ్యూటిఫుల్ హీరోయిన్ !

Isha Chawla: కరోనా బారిన పడుతున్న , హీరోయిన్ల లిస్ట్ లో చేరింది ఇషా చావ్లా. పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. ‘ప్రేమ కావాలి’ అనే సినిమా ద్వారా నేను ఉన్నాను అంటూ హీరోయిన్ గా పరిచయం అయింది. ఇషా చావ్లాలో మంచి అభినయం ఉంది. ఇక అందం ఉంది కాబట్టే ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది. చివరకు ఇలా కరోనా బాధితురాలిగా వార్తలకెక్కింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ […]

Written By: Neelambaram, Updated On : January 11, 2022 5:11 pm
Follow us on

Isha Chawla: కరోనా బారిన పడుతున్న , హీరోయిన్ల లిస్ట్ లో చేరింది ఇషా చావ్లా. పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. ‘ప్రేమ కావాలి’ అనే సినిమా ద్వారా నేను ఉన్నాను అంటూ హీరోయిన్ గా పరిచయం అయింది. ఇషా చావ్లాలో మంచి అభినయం ఉంది. ఇక అందం ఉంది కాబట్టే ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది. చివరకు ఇలా కరోనా బాధితురాలిగా వార్తలకెక్కింది.

Isha Chawla

ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంది ఇషా చావ్లా. ‘శ్రీమన్నారాయణ’, ‘పూలరంగడు’, ‘జంప్ జిలాని’ వంటి పలు చిత్రాలలో అడ్డు అదుపు లేకుండా ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోయినా పాపం ఇషా చావ్లాకి అసలు టైం కలిసి రాలేదు. ఇషా చావ్లా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. కబీర్ లాల్ దర్శకత్వంలో 6 బాషల్లో రూపొందుతోన్న “దివ్య దృష్టి” అనే సినిమాలో మెయిన్ లీడ్ గా చేస్తోంది.

Also Read:  వైసీపీ నేతల ‘రెడ్డి కామెంట్స్’కు దిమ్మిదిరిగి పోయే కౌంటరిచ్చిన బండ్ల గణేశ్.. త‌గ్గేదే లే..

ఏది ఏమైనా ఈ కరోనా మాత్రం ఎవర్నీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్న, శోభన ఇలా అందరూ కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని అసలు ఊహించలేదు. పైగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ మళ్ళీ ఆందోళన బాట పట్టారు.

Also Read: సమంత డైలీ లైఫ్ ఎలా ప్రారంభం అవుతుందో తెలుసా?

Tags