https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్.. చరణ్ లకు అలియా ట్వీస్ట్ ఇవ్వనుందా?

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరక్కెక్కిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తుండగా కీరవాణి అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటించనున్నారు. మెగా.. నందమూరి హీరోలు ఒకే స్క్రీన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2020 / 11:29 AM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరక్కెక్కిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తుండగా కీరవాణి అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటించనున్నారు. మెగా.. నందమూరి హీరోలు ఒకే స్క్రీన్ పై కన్పించడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’..‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు యూట్యూబ్లో కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.

    Also Read: బిగ్ బాస్-4: ఈవారం హౌస్ నుంచి వెళ్లేది అతడేనా?

    ‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ కు బాలీవుడ్ బ్యూటీ అలియాభట్.. ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ భామ ఓలివియా నటిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగు ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. నవంబర్ తొలివారంలో అలియాభట్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగులో పాల్గొననుంది.

    ‘ఆర్ఆర్ఆర్’ అలియాభట్ సీతగా కన్పించనుంది. ఆమె పాత్రలో ఊహించని ట్వీస్టులతోపాటు నటనకు ఆస్కారం ఉంటుందని తెలుస్తోంది. దీంతోనే రాజమౌళి అలియాభట్ కు ‘ఆర్ఆర్ఆర్’ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్లోనే రాంచరణ్.. ఎన్టీఆర్.. అలియాభట్ మధ్య వచ్చే సన్నివేశాలకు చిత్రీకరించనున్నారని టాక్ విన్పిస్తోంది.

    Also Read: ఇన్ సైడ్ టాక్: ‘ఉప్పెన’లో పాటపై గోలగోల..!

    ఈ సినిమాలో రాంచరణ్-అలియాభట్ లపై ఓ ప్రత్యేక పాట ఉంటుందని తెలుస్తోంది. ఈ పాట సినిమాకే హైలెట్ నిలుస్తుందట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు అన్ని భాషల్లో సెన్షేనల్ క్రియేట్ చేశాయి. అయితే ఎన్టీఆర్ టీజర్ పై మాత్రం వివాదాలు.. విమర్శలు వచ్చాయి. దీనిపై రాజమౌళి పెద్దగా స్పందించకుండానే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ను యథాతధంగా కొనసాగిస్తుండం విశేషం.