Homeజాతీయ వార్తలుBandi Sanjay: ‘డ్రగ్స్’ కేసులో ప్రమేయమున్న వారిని అరెస్ట్ చేసే దమ్ముందా?: బండి సంజయ్

Bandi Sanjay: ‘డ్రగ్స్’ కేసులో ప్రమేయమున్న వారిని అరెస్ట్ చేసే దమ్ముందా?: బండి సంజయ్

-మీ కుటుంబ సభ్యులతోసహా టీఆర్ఎస్ నేతల పేర్లు వెల్లడిస్తా…
-తాగి బండి నడిపితే తప్పు… మరి తాగి రాష్ట్రాన్ని నడిపే సీఎంను ఏమనాలి?
– ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే బేవకూఫ్ గాళ్లంటారా…?
-సీఎం సీటు కావాలని కొడుకు డాడీ డాడీ అంటుంటే…. కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అని తిరుగుతుండు
-ఇండియా కా ఖానా…. పాకిస్తాన్ కా గానా…నహీ చలేగా
-త్వరలోనే కేసీఆర్ కు హైదరాబాద్ పాతబస్తీ ఫైల్స్.. చూపిస్తా
-షాద్ నగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…
–  టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మత్తులో ముంచెత్తుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎంకు సవాల్ విసిరారు. ‘‘మీ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారో పేర్లు వెల్లడిస్తా…. వారందరినీ అరెస్ట్ చేసి డ్రగ్స్ టెస్ట్ చేసే దమ్ముందా?’’అని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో బీజేపీ నేతల ప్రమేయం ఉంటే వాళ్లను విచారించి అరెస్ట్ చేసుకోవచ్చని తెలిపారు. డ్రగ్స్ తీసుకునే, ప్రోత్సహించే నాయకులను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘ప్రైమ్ మినిస్టర్ కప్ -2022’’ పేరిట షాద్ నగర్ లో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ను బండి సంజయ్ ప్రారంభించారు. దాదాపు 400కుపైగా క్రికెట్ టీం సభ్యులతోపాటు పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు… అందులోని ముఖ్యాంశాలు…

* పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ తరపున ‘ప్రైమ్ మినిస్టర్ కప్-2022’’ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. క్రికెట్ ఆడేందుకు 400కు పైగా టీమ్ లు రావడం గర్వంగా ఉంది. నిర్వాహకులను మనస్పూర్తిగా అభినందిస్తున్నా…

* కేసీఆర్ కు మందు తాగడం, పత్తాలడటం తప్ప క్రికెట్ ఆంటే అసలు ఇష్టమే లేదు. పొరపాటున టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రాష్ట్రంలో అందరికి మందు తాగించి, పత్తాలడిపించడమే పనిగా పెట్టుకుంటాడు. జనమంతా మత్తులో ఊగుతూ చస్తుంటే వినోదం చూస్తాడు. నేనడుగుతున్నా…. తాగి బండి నడపడం తప్పని పోలీసులు కేసులు పెడుతున్నారు కదా… మరి తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ ను ఏమనాలి?

• కేంద్రంలోని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ‘ఖేలో భారత్’ పేరిట క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది. గతంలో ఒలింపిక్స్ జరిగితే రజతం, కాంస్య పతకాలు రావడమే భారత్ కు గగనం.

• కానీ మోదీ ప్రధాని అయ్యాక ఏకంగా మూడు గోల్డ్ పతకాలతోపాటు పెద్ద సంఖ్యలో రజత, కాంస్య పతకాలు సాధించడం దేశానికే గర్వకారణం. దేశంలో మారుమూల ప్రాంతంలోనైనా సరే క్రీడాకారులను గుర్తించి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖేలో భారత్ పేరిట అనేక కార్యక్రమాలు చేస్తోంది.

* మోదీ రోజుకు 18 గంటలు కష్టపడితే కేసీఆర్ రోజు కు 18 గంటలు తాగి ఊగడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు.

* ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఆడితే పాకిస్థాన్ గెలవలనుకునే లుచ్చగాళ్ళను ఉరికించి కొట్టాలి. ఇండియా కా ఖానా… పాకిస్తాన్ కా గానా నహీ చలేగా… హిందుత్వ కా నాస్… పాకిస్తాన్ పర్ విశ్వాస్ నహీ చలేగా…

* పాకిస్తాన్ తీవ్రవాదులు కాశ్మీర్ లో ఎంతటి నరమేధం స్రుష్టిస్తున్నారో చూస్తున్నరు కదా… కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సినిమాను మీరు అందరూ చూడండి. త్వరలోనే కేసీఆర్ పాతబస్తీ ఫైల్స్ సినిమా చూపిస్తా.

*సీఎం కేసీఆర్ కు పాలనను గాలికొదిలేసిండు. ఫాంహౌజ్ కే పరిమితమైండు. ఆయన కొడుకేమో సీఎం సీటు కోసం డాడీ డాడీ అంటే…అది తప్పించికోవడానికి ప్యాడీ ప్యాడీ అని గోల పెడుతూ తిరుగుతున్నడు.

* ప్రజా సమస్యలు పరిష్కరించాలని మేము అడుగుతుంటే మమ్ముల్ని బేవకూఫ్ గాళ్లని తిడుతున్నరు. ధాన్యం కొనమని అడిగితే మేం బేవకూఫ్ గాళ్లమా? ఆడుకోవడానికి స్టేడియం కావాలని అడిగితే బేవకూఫ్ గాళ్లమా? ఉద్యోగాలు కావాలని అడిగితే బేవకూఫ్ గాళ్లమా? ప్రజలు ఆలోచించాలి.

* నీకు దమ్ముంటే డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న వాళ్ల ను అరెస్ట్ చేసి టెస్ట్ చేసే దమ్ముందా? ఆ కేసులో బీజేపీ వాళ్ళున్నా అరెస్ట్ చేయండి. మేం అడ్డు చెప్పం. ఎందుకంటే బీజేపీ డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉంటుంది. అలాంటి వారిని సహించే ప్రసక్తే లేదు. అట్లాగే టీఆర్ఎస్ లో, మీ కుటుంబ సభ్యుల్లో డ్రగ్స్ తీసుకునే వాళ్ల పేర్లు వెల్లడిస్తా…. వారందరినీ అరెస్ట్ చేసి డ్రగ్స్ పరీక్ష చేసే దమ్ముందా?

* కానీ సీఎం కు దమ్ములేదు. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఉన్నోళ్ళంతా టీఆరెస్ వాళ్ళే. విచారణ పేరుతో హంగామా చేయడం… డబ్బులు దండుకున్నాక కేసును మూసేయడం కేసీఆర్ కు అలవాటుగా మారింది.

* తెలంగాణ కోసం బలిదానం చేసిన 1400 మంది యువత ఆత్మలు కేసీఆర్ పాలన ను చూసి ఘోషిస్తున్నాయ్.

* అందుకే కేసీఆర్ కుటుంబ-నియంత-అవినీతి పాలనను అంతం చేసేందుకే ఈనెల 14 నుండి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్న మీ అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్న.

* ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ,కోశాధికారి శాంతి కుమార్, పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, గురువారెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సిహ్మారెడ్డి, యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి, మహేశ్వరం నియోజక వర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] mla roja: వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగిన రోజా అంటే జగన్ కు ప్రత్యేక అభిమానమే. ఆమెకు మంత్రి పదవి విషయంలో అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి ప్రతి సారి ఊరిస్తూనే ఉంది. అక్కడ ఉన్న సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి దరి చేరడం లేదు. కానీ ఆమె అనుకున్న పనులు మాత్రం నెరవేర్చడంలో జగన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేసేస్తారు. ఇందులో భాగంగానే ఆమె ఇటీవల తన డిమాండ్లు చెప్పగా సానుకూలంగా స్పందించి ఆమె చెప్పిన పనులు చేసి పెట్టారు. […]

  2. […] Drugs In Hyderabad: హైదరాబాద్ ను డ్రగ్స్ మూలాలు వీడటం లేదు. పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా అడ్డదారుల్లో అక్రమంగా మత్తు పదార్థాల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. ఆదివారం ఓ పబ్ లో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది మత్తు పదార్థాలు తీసుకున్నట్లు రుజువు అయింది. అందరు సెలబ్రిటీలు కావడంతో కేసు పెట్టేందుకు పోలీసులు కూడా ముందుకు రావడం లేదు. ఫలితంగా అందరిని వదిలేశారు. దాదాపు 150 మంది పట్టుబడ్డారంటే మత్తు పదార్థాల వ్యాపారం ఎంతలా పెరిగిపోయిందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాల నిరోధకం ముందుకు సాగేలా కనిపించడం లేదు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular