https://oktelugu.com/

తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?

తెలంగాణలో బీజేపీ దూకుడుగా వెళుతోంది. పార్టీకి కలిసొచ్చే ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ తెలంగాణలో బలపడేందుకు శతవిధలా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అధిష్టానం నుంచి స్థానిక నేతలకు పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుండటంతో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకెళుతోంది. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ స్థానికంగా మరింత బలపడేలా స్కెచ్ వేస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం ఈక్రమంలోనే బీజేపీ-టీఆర్ఎస్ నేతలు కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 13, 2020 / 11:25 AM IST
    Follow us on


    తెలంగాణలో బీజేపీ దూకుడుగా వెళుతోంది. పార్టీకి కలిసొచ్చే ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ తెలంగాణలో బలపడేందుకు శతవిధలా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అధిష్టానం నుంచి స్థానిక నేతలకు పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుండటంతో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకెళుతోంది. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ స్థానికంగా మరింత బలపడేలా స్కెచ్ వేస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది.

    కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం

    ఈక్రమంలోనే బీజేపీ-టీఆర్ఎస్ నేతలు కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కొందరు టీఆర్ఎస్ చెందిన నేతలు దాడిచేసినట్లు తెలుస్తోంది. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ లోని కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు ఎంపీ అరవింద్ పై దాడిచేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పట్టపగలు ఒక ప్రజాప్రతినిధి కొందరు దాడిచేయడం తెలంగాణ ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీకి సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

    కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించుకోవాలన్నారు. కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత పై గతంలో ఉన్న కేసులన్నీ బయటకు తీస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. తమ పార్టీ నేతనే దాడి చేయడాన్ని తేలికగా వదిలిపెట్టబోమని టీఆర్ఎస్ గుణపాఠం చెబుతామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే బదులిస్తుండటంతో ఇరుపార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది.

    ‘రాజధాని’ విషయంలో 17 తరువాత ఏం జరుగుతోంది..?

    బీజేపీ ఎంపీపై దాడి ఘటనను ఆపార్టీ నేతలు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ అంశాన్ని వాడుకొని పైచేయి సాధించేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రజా సమస్యలను లెవనెత్తుతూనే.. ఎంపీపై దాడి ఘటనను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ అంశంతో టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ఉండటాన్ని ఆ పార్టీ నేతలు అడ్వంటేజీ తీసుకొని టీఆర్ఎస్ పై దూకుడుగా వెళుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు స్థానికంగా బలపడేందుకు బీజేపీ చేస్తున్న వ్యూహాలు ఏమేరకు సక్సస్ అవుతాయో వేచిచూడాల్సిందే..!