ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

రాష్ట్ర ప్రభుత్వం కాపు సామాజికవర్గం కోసం రూపొందించిన కాపునేస్తం పథకాన్ని కావాలని పక్కదొవ పట్టిస్తున్న వైనం రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకుంది. సిఎం సొంత సామాజికి వర్గానికి చెందిన వారికి కాపునేస్తం పథకంలో సాయమందించడం వివాదస్పదంగా మారింది. ఈ అంశంపై ఆ పార్టీలోని కాపు నేతలు ఏం సమాధానం చెబుతారో మరి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో వైసీపీలో ఉన్న కాపు నాయకులు కొందరు ప్రెస్ […]

Written By: Neelambaram, Updated On : July 13, 2020 3:14 pm
Follow us on


రాష్ట్ర ప్రభుత్వం కాపు సామాజికవర్గం కోసం రూపొందించిన కాపునేస్తం పథకాన్ని కావాలని పక్కదొవ పట్టిస్తున్న వైనం రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకుంది. సిఎం సొంత సామాజికి వర్గానికి చెందిన వారికి కాపునేస్తం పథకంలో సాయమందించడం వివాదస్పదంగా మారింది. ఈ అంశంపై ఆ పార్టీలోని కాపు నేతలు ఏం సమాధానం చెబుతారో మరి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో వైసీపీలో ఉన్న కాపు నాయకులు కొందరు ప్రెస్ మీట్ లు పెట్టి పవన్ కళ్యాణ్ ను విమర్శలు గుప్పించారు. రాజకీయాలపై పవన్ కు సరైన అవగాహన లేదని ఆరోపించారు. కాపుల పేరుతో రెడ్డి సామాజిక వర్గానికి కాపు కార్పొరేషన్ నిధులను అందజేస్తున్న విషయం బయటపడితే.. ఆ నాయకులు ఎందుకు నోరు విప్పడం లేదో కాపు సామాజిక వర్గానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం

కాపునేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకంలో ఇతర సామాజిక వర్గాల వారిని లబ్ధిదారులకుగా చేర్చి వారికి సాయం చేయడం కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేయడమేనని ఆ సామాజిక వర్గానికి చెందిన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. కర్నూలు జిల్లాలో బండిఆత్మకూరు మండలంలోని లింగాపురం, జి.సి పాలెం గ్రామాల్లలో మొత్తం 22 మంది లబ్ధిదారులు ఉంటే వారిలో 18 మంది రెడ్డి సామాజిక వర్గానికి కాపుసేస్తం పథకం వర్తింపచేసిన విషయం బయట పడింది. అంటే ఇక్కడ కాపు నేస్తం పథకంలో కాపు సామాజిక వర్గానికంటే రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే అధిక సంఖ్యలో లబ్ధిపొందారనే విషయం స్పష్టమవుతుంది. ఈ లెక్కన ఆ ప్రాంతంలో మొత్తం ఎంత మందికి లబ్ధిజరిగింది వారిలో కాపు సామాజికవర్గం, ఇతర సామాజికవర్గాల వారు ఎంత మంది అనే విషయంపై అధికారులు ఆరా తీసుతున్నారు.

‘రాజధాని’ విషయంలో 17 తరువాత ఏం జరుగుతోంది..?

కాపు నేస్తం పథకంలో ఇలా అనర్హులను అర్హులుగా, అర్హులను అనర్హులుగా చూపిస్తూ కాపు కార్పొరేషన్ చేసిన నిర్వాహకాలపై కాపు సామాజికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపునేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తే ఇంకెన్ని అక్రమాలు వెలుగు చూస్తాయోననే సందేహం ఇప్పడు అందరి మదిని తొలిచేస్తుంది. ప్రభుత్వ పథకాల్లో వెలుగు చూస్తున్న అక్రమాలకు ఇది నిదర్శనంగా మారిందంటున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి క్షేత్రస్థాయిలో పట్టు సాధించామని చెబుతున్న ప్రభుత్వం ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.