రాష్ట్రంపై కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కేసుల సంఖ్య వేగంగా పెరగడంతోపాటు మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వం మాత్రం కరోనాను ఎదుర్కోవడంతో విజయవంతం అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంది. తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన భార్య, కుమార్తెలకు వైరస్ సోకింది. ఆయన కొద్ది రోజులుగా ప్రభుత్వం కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో వైరస్ బారిన పడినట్లు ప్రచారం జరిగింది. స్వాబ్ నమూనా పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు ఆదివారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తొలుత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రి స్విమ్స్ లో చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయి హైదరాబాదులోని ప్రవేటు ఆసుపత్రిలో చేరారు.
కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం
డిప్యూటీ సిఎం వ్యవహరించిన తీరుతో ఇప్పుడు ప్రభుత్వం ఇరుకున పడింది. బాధ్యతా యుతమైన పదవిలో ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోకుండా పోరుగు రాష్ట్రంలోని ప్రవేటు ఆసుపత్రికి వెళ్లిపోవడంపై ప్రతిపక్షాలు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ వైద్యంపై ఉప ముఖ్యమంత్రికే నమ్మకం లేకపోతే సామాన్యులకు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి అధికారులు సకల సౌకర్యాలు కల్పిస్తారు.. అయినా హైదరాబాదులోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలచుకున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
టిడిపి ప్రభుత్వం హయంలో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తన మోకాలుకు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వస్తే.. గుంటూరు ప్రభుత్వాసుప్రతిలో మోకాలు శస్త్ర చికిత్స చేయించుకుని ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే తక్కువేమీ కాదని ప్రజలకు సూచించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లోని మంత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రవేటు ఆసుపత్రులకే ప్రాధన్యత ఇచ్చేలా వ్యవహరించడం ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది.
‘రాజధాని’ విషయంలో 17 తరువాత ఏం జరుగుతోంది..?
ప్రాణాలకు తెగించి ప్రభుత్వాసుపత్రుల్లో కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపణలు ఎదుర్కొన్న జగన్ ప్రభుత్వం ఇప్పడు ప్రభుత్వం కోవిడ్ సెంటర్ లో చికిత్స తీసుకుంటూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను అవమానించడంగానే భావించాల్సిన వస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాదులోని ప్రవేటు ఆసుపత్రులు కోవిడ్ చికిత్సకు రోజుకు రూ.లక్షల్లో బిల్లులు వేస్తున్నా అక్కడ చికిత్స చేయించేకునేందుకు వెనుకాడకుండా ప్రవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. ఈ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందిగా అందుకే అంత ధైర్యంగా వెళ్లి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.