https://oktelugu.com/

ఏం పీకుతావ్.. రాక్షసుడు కేసీఆర్.. బండి సంజయ్ నిప్పులు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి దారుణ వ్యాఖ్యలతో హోరెత్తించారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ గెలిచిన తీరుపై ఈ హాట్ కామెంట్స్ చేశారు. తమ వైఫల్యాలన్నింటిని కేంద్రప్రభుత్వంపై మోపడం కేసీఆర్ సర్కార్ కు అలవాటైందని.. అన్నింటిని కేంద్రంపై మోపితే రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ఏం పీకుతున్నాడని బండి సంజయ్ దారుణ వ్యాఖ్యలు చేశారు. అందుకే అసెంబ్లీలో టీఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారని.. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 21, 2021 / 04:02 PM IST
    Follow us on

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి దారుణ వ్యాఖ్యలతో హోరెత్తించారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ గెలిచిన తీరుపై ఈ హాట్ కామెంట్స్ చేశారు. తమ వైఫల్యాలన్నింటిని కేంద్రప్రభుత్వంపై మోపడం కేసీఆర్ సర్కార్ కు అలవాటైందని.. అన్నింటిని కేంద్రంపై మోపితే రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ఏం పీకుతున్నాడని బండి సంజయ్ దారుణ వ్యాఖ్యలు చేశారు. అందుకే అసెంబ్లీలో టీఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారని.. ఢిల్లీకి పోయి కేసీఆర్ ఏం తిప్పలేడని అర్థమైందన్నారు.

    బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణను కేసీఆర్ చేతుల్లో పెట్టారని.. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నడుచుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఓ రాక్షసుడిలా మారారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖం చూడడానికి ప్రజలవెరూ సిద్ధంగా లేరని అన్నారు.

    బీజేపీని ఎదుర్కోవడానికి తన ముఖం చూపించలేకపోయారని.. అందుకే కాంగ్రెస్, పీవీ నరసింహరావు పేరును అడ్డుగా పెట్టుకొని గెలిచారని చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచినట్టా..? పీవీ నరసింహరావు గెలిచినట్టా అని బండి ప్రశ్నించారు.

    ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఇతర రాజకీయ పక్షాలు లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనన్నారు.

    తాము ఓడిపోతే పీఆర్సీ ఇవ్వమంటూ టీఆర్ఎస్ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ బెదిరింపులతోనే ఓటర్లు అధికార పార్టీకి ఓటు వేశారని బండి అన్నారు. పీఆర్సీపై తాము పోరును కొనసాగించామని.. కేసీఆర్ గల్లాపట్టుకుంటామని హెచ్చరించారు.