https://oktelugu.com/

ఆటనాది.. కోటి మీది అంటున్న యంగ్ స్టార్…

చక్కని ప్రతిభ ఉండి.. అవకాశం రానివారు ఎందరో.. సంపాదనకు దారి తెలియక పేదరికంలో మగ్గిపోతున్న వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి దండిగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఇదిగో.. ఆటనాది.. కోటి మీది… అంటూ ఊరిస్తూ… ఈఎంకే టీజర్ ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చింది. యంగ్ యమ ఎన్టీఆర్ హోస్టింగ్ తో జెమినీ టీవీలో ప్రారంభం కానున్న ఈ సరికొత్త షో కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. Also Read: ప్రిన్స్.. జక్కన్న మూవీ.. నిజమేనా అంటున్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 21, 2021 / 04:00 PM IST
    Follow us on


    చక్కని ప్రతిభ ఉండి.. అవకాశం రానివారు ఎందరో.. సంపాదనకు దారి తెలియక పేదరికంలో మగ్గిపోతున్న వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి దండిగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఇదిగో.. ఆటనాది.. కోటి మీది… అంటూ ఊరిస్తూ… ఈఎంకే టీజర్ ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చింది. యంగ్ యమ ఎన్టీఆర్ హోస్టింగ్ తో జెమినీ టీవీలో ప్రారంభం కానున్న ఈ సరికొత్త షో కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

    Also Read: ప్రిన్స్.. జక్కన్న మూవీ.. నిజమేనా అంటున్న ఫ్యాన్స్..

    స్టార్ మాలో మీలో ఎవరు కోటీశ్వరుడు(ఎంఈకే) బిగ్ బాస్ సీజన్ లను టాప్ టీఆర్పీలలో నిలబెట్టిన తారక్ పైనే ఈ సారి జెమినీ టీవీ ఆశలు పెట్టకుంది. ఈఎంకే సారూప్యతలు ఉన్న ఈఎంకే( మీలో ఎవరు కోటీశ్వరుడు) కార్యక్రమంతో టీఆర్పీ వేటలో పడింది సదరు ఎంటర్ టైన్ మెంట్ చానెల్. ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ తారక్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ఇప్పుడు మరోసారి అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంతో తెలియజేస్తూ.. కొత్త టీజర్ ని రిలీజ్ చేయగా.. దీనికి అద్భుత స్పందన వస్తోంది.

    Also Read: ‘వకీల్ సాబ్’ హిస్టరీ రిపీట్ చేస్తాడా..?

    ఎవరు మీలో కోటీశ్వరులు తొలి సీజన్ లో జనాల్లో ఉత్కంఠను పెంచుతోంది. ప్రోమోలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్విజ్ షోకి త్వరలోనే రిజిష్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. మరికొన్ని నెలలలో జెమినీ టీవీలో షో ప్రారంభం అవుతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవి, ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ ముగించి.. త్రివిక్రం దర్శకత్వంలో నటించాల్సి ఉంది. త్వరలో కేసీఎప్ దర్శకుడితోనూ పనిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే..

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోలకు ప్రాధాన్యత పెరిగింది డైలీ సీరియళ్ల కన్నా ప్రజలకు రియాలిటీ షోలకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా తెలుగు చానళ్లలో వస్తున్న రియాలిటీ షోలు ఇరు రాష్ట్రాలతో పాటు… ఇతర ప్రాంతాల్లో ఉన్న తెగులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జెమినీ టీవీలో వచ్చే కార్యక్రమంపై ఉత్కంఠ నెలకొంది.