https://oktelugu.com/

ప్రిన్స్.. జక్కన్న మూవీ.. నిజమేనా అంటున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ జక్కన్న ప్రస్తుతం రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. వచ్చే నెలతో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టి ఈ ఏడాది అక్టోబర్ మాసంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే… ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత రాజమౌళి తదుపతి సినిమా మహేశ్ బాబు హీరోగా ఉంటుందని ఇప్పటికే చాలా బలంగా ప్రచారం జరుగుతోంది. Also Read: ఆటనాది.. కోటి మీది అంటున్న యంగ్ స్టార్… రాజమౌళి కూడా గతంలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 21, 2021 / 04:11 PM IST
    Follow us on


    టాలీవుడ్ జక్కన్న ప్రస్తుతం రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. వచ్చే నెలతో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టి ఈ ఏడాది అక్టోబర్ మాసంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే… ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత రాజమౌళి తదుపతి సినిమా మహేశ్ బాబు హీరోగా ఉంటుందని ఇప్పటికే చాలా బలంగా ప్రచారం జరుగుతోంది.

    Also Read: ఆటనాది.. కోటి మీది అంటున్న యంగ్ స్టార్…

    రాజమౌళి కూడా గతంలో మహేశ్ బాబుతో సినిమా చేయాల్సి ఉంది. తదుపరి సనిమా అదే ఉండవచ్చు అన్నట్లుగా నమ్మకంగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఆ రాబోయే ప్రాజెక్టుకోసం రాజమౌళి తండ్రి.. ప్రముఖ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతకొంత కాలంగా రాజమౌళి మరియు మహేశ్ బాబు కాంబో మూవీ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

    Also Read: ‘వకీల్ సాబ్’ హిస్టరీ రిపీట్ చేస్తాడా..?

    ఈ సమయంలో జక్కన్న చత్రపతి శివాజీ కథతో మహేశ్ బాబుతో సినిమాను రూపొందించబోతున్నారు. అందుకు సంబంధించిన స్క్రీప్ట్ ను విజయేంద్ర ప్రసాద్ తయారు చేస్తున్నారు అంటూ పుకారులు షికారులు చేస్తున్నాయి. మహేశ్ బాబును చత్రపతి శివాజీగా రాజమౌళి చూపించబోతున్నాడు అనే పుకారులు సినిమా ప్రారంభం కాకుండానే అంచనాలు పీక్స్ కు తీసుకెళ్లాయి. ఒకవేళ ఆ వార్తలే నిజం అయితే.. ఈ పుకారులు కార్యరూపం దాల్చితే.. మహేశ్ అభిమానులతో పాటు యావత్ దేశంలోని సినీ అభిమానులకు పండుగే అంటున్నారు సినీ విశ్లేషకులు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఇప్పటికే స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించిన రాజమౌళి ప్రతీ స్టార్ కు చక్కని బ్రేక్ ఇచ్చారు. హిట్ సినిమాలు అందించి.. బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేశారు. మగధీర.. బాహుబలి.. చత్రపతి.. సింహాద్రి.. ఈగ .. వంటి చిత్రాలతో రాజమౌళి సినీ చరిత్రను సృష్టించాడు.. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుతో సైతం సినిమా తీసి సరికొత్త రికార్డు సృష్టించాలని అతడి అభిమానులు కోరుతున్నారు.