Bandi Sanjay : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎమ్మెల్యేల కొనుగోలు మాల్ పై పోరుబాటపట్టారు. కేసీఆర్ కు సవాళ్లు విసిరాడు. ఎమ్మెల్యే కొనగోలు మాల్ అక్రమం కాదంటే యాదాద్రి వద్దకొచ్చి ప్రమాణం చేయాలంటూ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరాడు. ఈ మేరకు ఈరోజు భారీ ర్యాలీగా యాదగిరి గుట్టకు బండి సంజయ్ బయలు దేరారు.

తెలంగాణ కాషాయ దళపతి కి కమ్యూనిస్టు కార్యకర్త లాల్ సలాం చేయడం ఈ ర్యాలీలో అందరినీ ఆకట్టుకుంది. * యాదగిరిగుట్ట వెళుతుండగా మార్గమధ్యలో చిల్లపురం వద్ద బండి సంజయ్ ను కలిసిన మేకల కాశయ్య ఈ మేరకు బండికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. “అన్నా…. నాపేరు మేకల కాశయ్య. కమ్యూనిస్టు కార్యకర్తను. మీ నాయకత్వంలో మాలాంటి పేదల కోసం బీజేపీ చేస్తున్న పోరాటాలు భేష్.మా కమ్యూనిస్టులు కేసీఆర్ కు అమ్ముడుపోయారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనలో పేదలు, దళితులంతా అల్లడిపోతున్నారు. అందుకే మునుగోడు ఎన్నికల్లో మేమంతా బీజేపీకే ఓటేస్తం.” అని పేర్కొన్నారు.ఈ సందర్బంగా బండి సంజయ్ తో కలిసి ఫోటో దిగారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఆదుకుంటారని ఇంటింటా ప్రచారం చేసి గెలిపించుకుంటామని బండి సంజయ్ ఈ సందర్భంగా కాశయ్యకు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మేకల కాశయ్య కు కాషాయ కండువా కప్పిన బండి సంజయ్ ఆయనను బీజేపీలో చేర్చుకున్నారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పాదాల చెంత బండి సంజయ్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. బండి సవాల్ కు ఇటు కేసీఆర్ కానీ.. అటు టీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించడం లేదు.