Mahesh Babu Twitter: దేశంలోకెల్ల అందగాడు ఎవరయ్యా అంటే అందరూ చెప్పే సమాధానం మన ‘మహేష్ బాబు’నే.. ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ లు ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోలు అయిపోయినా కానీ.. మహేష్ బాబు ఇంకా హిందీ సినిమాల్లోకి వెళ్లకపోయినా కానీ.. ఆ క్రేజ్ మాత్రం మహేష్ కు ఉంది. ఒక హాలీవుడ్ రేంజ్ హీరో లుక్ లో మహేష్ ఉంటారు. ఇప్పుడు రాజమౌళి నెక్ట్స్ సినిమాతో మహేష్ రేంజ్ ప్రపంచవ్యాప్తం కానుంది.

టాలీవుడ్ తోపాటు దక్షిణాది, హిందీకి తెలిసిన మన మహేష్ బాబు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటాడు. పలువురు సినిమాలు చూసి విషెస్ చెప్పడాలు.. పుట్టినరోజులకు శుభాకాంక్షలు చెబుతుంటాడు. తాజాగా మహేష్ సోషల్ మీడియాలో మరో ఘనత సాధించాడు.
తాజాగా ట్విట్టర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన ఫీట్ ను సాధించాడు. అతడి పాలోవర్ల సంఖ్య 13 మిలియన్లకు చేరడం విశేషం. తాజాగా చేరిన ఫాలోవర్లతో సౌత్ ఇండియాలోనే ఎక్కువమంది ఫాలో అవుతున్న నటుడిగా మహేష్ రికార్డ్ సృష్టించాడు.

అందరికంటే దేశంలో పాపులారిటీలో హిందీ హీరోలు ముందుంటారు. ఎందుకంటే హిందీ మార్కెట్ తోపాటు ప్రజలు ఎక్కువ కాబట్టి వారికే ఫాలోవర్ల సంఖ్య ఎక్కువ. దక్షిణాది వరకూ వచ్చేసరికి మన మహేష్ బాబు అందరు హీరోలను తోసిరాజని టాప్ లో నిలవడం విశేషం.