Janhvi Kapoor- Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయదేవరకొండ పెళ్లిపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఇటీవల ఈ యంగ్ హీరో రష్మిక తో కలిసి మాల్దీవులు వెళ్లిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో రచ్చ చేశారు. వీరు మాల్దీవులకు వెళ్లడానికి కారణమేంటి..? అంటూ కొందరు పోస్టులు పెట్టి హల్ చల్ చేశారు. అంతేకాకుండా వీరు లవర్స్ గా మారిపోయారని కొన్ని వీడియోస్ క్రియేట్ చేశారు. అయితే ఆ విషయంపై ఇరువురూ రెస్పాండ్ కాలేదు. అటు రష్మిక తనకు లవ్ చేసేంత టైం లేదని ఓ సందర్భంలో చెప్పింది. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండపై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సంచలన కామెంట్స్ చేసింది. ‘విజయ్ కి ఎప్పుడో పెళ్లి అయిపోయింది’ అని అనడం ఇండస్ట్రీలో సెన్సెషనల్ న్యూస్ క్రియేట్ అయింది.

విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ ఇటీవల విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. అయినా ఈ హీరో నటనకు అంతా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా బాలీవుడ్ లెవల్లో విజయ్ కి లేడీ ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు. విజయ్ పై క్రష్ ఉందంటూ సారా అలీఖాన్, కియారా, జాన్వీకపూర్ లు గతంలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు జాన్వీకపూర్ మరోసారి విజయ్ దేవరకొండ పేరుతో సంచలన కామెంట్ చేశారు.
జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతుంది. ఆమె నటించిన ‘మిలి’ నవంబర్ 4న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా మారింది. తాజాగా ఆమె ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె విజయ్ దేవరకొండ గురించి మాట్లాడింది. జాన్వీని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ‘ మీకు స్వయంవరం జరిగితే అందులో ఏ హీరో ఉంటే బాగుండాలని అనుకుంటున్నారు..?’ అని అడిగారు. దీంతో జాన్వి ‘రణబీర్ కపూర్, హృతిక్ రోషన్, టైగర్ ష్రాప్’ పేర్లను చెబుతుంది.

రణబీర్ కపూర్ కు పెళ్లి అయిపోయింది. వేరే పేరు చెప్పండి అని యాంకర్ అడుగుతాడు. ఇంతలో ఆమె ఆలోచిస్తుండగానే.. మరి విజయ్ దేవరకొండ లేడా..? అని అడుతాడు. దీంతో జాన్వి ‘విజయ్ దేవరకొండకు పెళ్లి అయిపోయిందిగా..’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేంటి విజయ్ కి ఎప్పుడు పెళ్లయిందని ఆ వీడియో చూసిన ప్రేక్షకులు షాక్ కు గురయ్యారు. ఇటీవల విజయ్, రష్మికలు కలిసి మాల్దీవులు వెళ్లారు. అప్పుడప్పుడు కలుస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో వారిద్దరికి పెళ్లి అయిపోందని అనుకుంటుంది జాన్వి.. అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.