Bandi Sanjay: కరీంనగర్ జైలు నుండి విడుదలైన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.. ఇక టీఆర్ఎస్ పై ధర్మయుద్ధం చేస్తానని.. కేసీఆర్ ను జైలుకు పంపేవరకూ వదిలిపెట్టనని బండి సంజయ్ శపథం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను జైలుకు పంపినని సంకలు గుద్దుకుండు.. ఆ సీఎంకు తెల్వదేమో… బీజేపీ కార్యకర్తలకు, నాకు జైలు కొత్త కాదు. నేను జైలుకు పోవడం ఇది 9వ సారి. నేను నీలాగా చీటర్ ను కాదు… దొంగతనం చేసో.. లంగతనం చేసో జైలుకు పోలేదు. నేను జైలుకు పోయింది ఉఫాధ్యాయుల కోసం, ఉద్యోగుల కోసం… నువ్వు సంబరపడు… నేనేమీ బాధపడను. ఉద్యోగ, ఉపాధ్యాయులు బాధపడుతున్నరు. కానీ 317 జీవోను మాత్రం సవరించాలని డిమాండ్ చేస్తున్న. లేనిపక్షంలో నీ సంగతి చూస్తాం…
సీనియర్లకు, జూనియర్లకు కొట్లాట పెట్టకు. ఆ జీవోను సవరించు. విడో, దివ్యాంగులకు, స్పౌజ్ లకు అవకాశం కల్పించు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చలు జరిపి న్యాయం చెయ్. కొందరు తూట్ పాలీష్ సంఘాల నేతలను పక్కన పెట్టాలి. లేకపోతే వాళ్లంతా నీవీపు సాఫ్ చేయడానికి సిద్ధం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సోదరులారా…. మాకు జైలు కొత్త కాదు.. మా ఆఫీస్ ను ధ్వంసం చేసిండ్రు. మా కార్యకర్తలను కొట్టిండ్రు, కాళ్లు, చేతులు విరగ్గొట్టిండ్రు. మహిళా కార్యకర్తలపై అత్యాచార యత్నం చేసిండ్రు. అయినా మేం బాధపడత లేదు. 317 జీవో సవరించేదాకా కొట్లాడతాం. దయచేసి మీరు స్పందించాలి. ఇప్పుడు స్పందించకపోతే మీ జీవితాలు నాశనమైతయ్. మీకు అండగా మేముంటం. మీ ఉద్యోగాలు పోతే మేం అధికారంలోకి వచ్చాక మేమిస్తాం. మీ గురించి మాట్లాడని సంఘాల వీపంతా సాఫ్ చేయండి…
ఇక యుద్దం స్టార్ట్ అయ్యింది. కొందరు ఉద్యోగ సంఘ నాయకులను సంకనేసుకున్నడు. నిన్ను, నీకు కొమ్ముకాసే ఉద్యోగ సంఘాల నాయకులను మాత్రం వదిలిపెట్టను. జైలుకు పంపినని అనుకుంటున్నవేమో…నేను జైలుకు పోతే… తెలంగాణ సమాజం బాధపడింది. బయటకు రావాలని కోరింది. నేను ధర్మం కోసం, న్యాయం, నిరుద్యోగుల కోసం మళ్లీ జైలుకు పోవడానికి నాతోసహా ప్రతి పార్టీ కార్యకర్త పోవడానికి సిద్ధమని బండి సంజయ్ ప్రకటించారు.
నువ్వు జైలుకు పోతే ఈ మూర్ఖుడు జైలుకు పోయిండు… ఇక బయటకు రానివ్వొద్దని తెలంగాణ సమాజం అంతా కోరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. నన్ను నా ఆఫీసును బద్దలు కొడతావ్. అందుకే హైకోర్టు మొట్టికాయలు వేసింది. థూ.. నీ బతుకు చెడు…ఇందుకోసమా నీకు అధికారం ఇచ్చింది? మేం నీలెక్క చీటర్లమా? అవినీతిపరులమా? దుండగులమా?
•ప్రజల కోసం కొట్లాడేటోళ్లం. నేను ఎంపీని, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, నీలాగా తూట్ పాలిష్ అంత గింత పార్టీ కాదు..ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ. నీ తాటాకు చప్పళ్లకు భయపడతమా? కార్యకర్తలపై లాఠీఛార్జ్ 9 సార్లు చేస్తవా? గ్యాస్ కట్టర్ పెట్టి ఆఫీస్ గేట్లను ధ్వంసం చేస్తవా?దళిత మహిళ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సంఘటనా స్థలం లేకున్న ముందస్తు అరెస్టు చేస్తవా? ఆమె అక్కడికి రానేలేదు. అయినా ఆమె ఏం తప్పు చేసిందని మళ్లీ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేస్తవ్? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తవా? లోపల జైలు ఎట్లుందో చూసి వచ్చిన… నువ్వు కూడా ఈ జైలుకు పోయే రోజులు దగ్గర్లో ఉన్నయ్. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం జైలుకు పోయిన కార్పొరేటర్లు మర్రి సతీష్, పెద్దపల్లి జితేందర్, కచ్చు రవి, బీజేపీ నాయకులు పుప్పాల రఘు లోపల సంతోషంగా ఉన్నరు. ఉద్యోగుల కోసం జైలుకు పోయిండ్రు అని కుటుంబ సభ్యులు సంతోషంగా ఆశీర్వదిస్తున్నరని బండి సంజయ్ అన్నారు.
నిన్ను గుంజుకుపోయి జైల్లో వేసే రోజు దగ్గర్లోనే ఉన్నయ్. వేల కోట్లు దోచుకుంటున్నవ్. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పే మాకు ఆధారం. ఈ కేసు తప్పని, మెట్టికాయలు వేసింది. నీ వ్యవహార శైలిని తప్పు పట్టింది. అయినా బయటకు రాకుండా గంటన్నర రెండుగంటలు నుండి నన్ను బయటకు రాకుండా ఒత్తిడి తెస్తున్నవ్. నాకు నష్టమేమీ లేదు. నాకు నీ లెక్క తాగుడు అలవాటు లేదు. నీలాగా దురలవాట్లు లేవు. ఇంకా వారం రోజులైనా జనం కోసం జైల్లో ఉండేందుకు సిద్దమన్నారు. నువ్వు రాష్ట్రంలో అధికారంలో ఉన్నవ్…. మేం కేంద్రంలో అధికారంలో ఉన్నామనే సంగతి గుర్తుంచుకో. నన్ను జైలుకు పంపినవ్ కదా….నన్ను జైలుకు పంపడం ద్వారా నీవెంత మూర్ఖుడివో, రాక్షసుడివో, నీచుడివో జనానికి అర్ధమైంది. హ్యాట్సాఫ్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు.
జనం నిన్ను థూ.. అంటున్నరు. నువ్వు సెక్యురిటీ లేకుండా బయట తిరుగు… నిన్ను టీచర్లు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు రాళ్లతో కొడతరు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులను అణగదొక్కినట్లు అనుకుంటున్నవమో.. నీ ఆటలిక సాగవు.. ఎవరైతే కుటుంబ పాలన చేసిన నీలాంటి వాళ్లంతా మట్టి కరిచిపోయిండ్రు. నీ నీచపు పాలనకు చరమ గీతం పాడతారు.
నేను జైల్లో ఉన్నప్పుడు నాకు సహకరించిన పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకులకు, అడుగడుగునా నాకు అండగా ఉన్న నా కార్యకర్తలకు, నా క్షేమాన్ని కోరుకుని ఆశీర్వదించిన తెలంగాణ సమాజానికి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు, మీడియాకు శిరస్సు వంచి క్రుతజ్ఝతలు..బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ను ప్రత్యేక క్రుతజ్ఝతలు. వారి వయసును కూడా చూడకుండా రాత్రి అంతా పోలీసులు చలిలో కూర్చోపెట్టడం బాధేసిందని బండి సంజయ్ వాపోయారు.
ప్రధాని నరేంద్రమోదీ గారి ఆశీస్సులతో, అమిత్ షా గారి కనుసన్నల్లో జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఇదే పంథాలో ధర్మయుద్దాన్ని కొనసాగిస్తాం. బీజేపీ కార్యకర్తల సత్తా, దమ్ము ఏందో చూపించబోతున్నం. ‘జాగరణ’ సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడ్డ కార్యకర్తల దుబాల శ్రీనివాస్, ప్రసన్న ఇంటికి వెళుతున్నా… ఆ తరువాత పార్లమెంట్ ఆఫీసుకు వెళతాం… రేపు గాయపడి హైదరాబాద్ లో ఉన్న వాళ్లందరినీ కలుస్తా… త్వరలో మా భవిష్యత్ కార్యాచరణను
•పోలీసులు జర్నలిస్టులను నా కళ్లముందే కొట్టిండ్రు. గుంజుకుపోయిండ్రు. తరువాత సారీ చెబితే మీరు కూల్ అయ్యిండ్రు. కావాలనే కొట్టి కావాలనే సారీ చెప్పిండ్రు. ఆర్టీసీ ఉద్యమం సమయంలో ఎలా చేశారో బయట నుండి పోలీసులను తీసుకొచ్చి కొట్టించిండ్రు.
కేటీఆర్ వ్యాఖ్యలపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు… ‘‘ఏ తూట్ పాలిష్ గానితో నాకేంది? ముందు వాళ్ళ ఆయ్యను మంచి చూసుకోమను అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నేను తల గుద్దుకున్నట్లు ప్రచారం జరగడం సరికాదు… పోలీసుల దాడిలో అద్దాలు పగలడంతో నా కాలి కింద గాజు ముక్కలుండే.. వాటిని తీయడానికి కిందకు వంగితే ఆ పోలీస్ ఆఫీసర్ నాకు దెబ్బ తగలకుండా కాపాడిండు. నాపై దురుసుగా వ్యవహరించిన పోలీసుల పేర్లు తరువాత చెబుతా…
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, కార్యదర్శి కొల్లి మాధవి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు జి.క్రిష్ణారెడ్డి, ప్రతాని రామక్రిష్ణ తదితరులు బండి సంజయ్ కుమార్ వెంట ఉన్నారు. అంతకుముందు జైల్లో నుండి బయటకు రాగానే కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా బండి సంజయ్ ను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Bandi sanjay criticizes kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com