Karthika Deeoam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో దీప పిల్లలకు భోజనం చేపిస్తూ ఉండగా.. అంతలోనే పిల్లలిద్దరూ రుద్రాణి గురించి మాట్లాడతారు. ఆమె ప్రవర్తన మరోలా ఉందని అనటంతో దీప పెద్దవాళ్ల విషయాల గురించి మాట్లాడుకోవద్దని నచ్చచెబుతుంది. మరోవైపు కార్తీక్ ఒంటరిగా నిల్చొని అందరు సంతోషాలకు దూరం కావటానికి కారణం నేనే అంటూ బాధ పడతాడు. అన్నీ వదిలేసుకుని సంతోషంగా ఉండాలి అనుకున్నా సమయంలో రుద్రాణి బాధ మరింత ఎక్కువైందని బాధపడతాడు.
ఇక అక్కడికి దీప వచ్చి ఏం జరిగిందని అడగటంతో కార్తీక్ తన మనసులో రుద్రాణి పిల్లలలో ఒకరిని దత్తత తీసుకుంటా అనే విషయాన్ని తలుచుకుంటాడు. ఇక దీప రుద్రాణి అప్పు గురించి ఏం భయపడవద్దని ధైర్యం చెబుతుంది. కార్తీక్ అది కాదని మౌనంగా ఉండటం తో వెంటనే దీప కార్తీక్ చెయ్యి తీసుకుని ఒట్టు వేయించుకుంటుంది. కార్తీక్ ఏమి చేయలేక రుద్రాణి ఒప్పందం తీసుకున్న విషయాన్ని చెబుతాడు.
వెంటనే దీప షాక్ అవుతుంది. అలా ఎలా ఒప్పందం ఇచ్చారు అని బాగా ఏడుస్తుంది. కార్తీక్ మాత్రం కావాలని ఇవ్వలేదని తొందరలో సైన్ చేశాక అసలు నిజం చెప్పిందని అంటాడు. ఇక దీప బాగా ఏడుస్తూ ఎందుకిలా నా తలరాత ఉంది అని బాధపడుతుంది. ఎప్పుడు పిల్లలకు దూరంగానే ఉంటున్నానని బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక కార్తీక్ దీప మాటలు విని అక్కడి నుంచి రుద్రాణి ఇంటికి బయలుదేరుతాడు.
మరోవైపు రుద్రాణి తన మనుషులకు డబ్బులు ఇస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అంతలోనే కార్తీక్ వచ్చి మీ అప్పు తీరుస్తాను మరోసారి మా జోలికి రావద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. రుద్రాణి మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా తేలికగా తీసి పారేస్తుంది. కార్తీక్ ఇంటికి వెళ్లేసరికి దీప ఎక్కడికి వెళ్లారని రుద్రాణి అప్పు ఎలాగైనా తీర్చేద్దాం అని కార్తీక్ కు ధైర్యం చెబుతుంది. దీప కార్తీక్ కూడా దీప సహనాన్ని సంతోషంగా ఫీల్ అవుతాడు.