CM KCR: రాష్ట్రంలో ఒక్క సారిగా రాజకీయాలు బగ్గుమంటున్నాయి. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు కొంత రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు కనిపించినా.. అవి అక్కడి వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే హుజూరాబాద్ ఎన్నికలు ముగిసి, ఈటల రాజేందర్ మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత రాష్ట్రంలో ఆ వేడి ఇంకా పెరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలపైనే చర్చించుకుంటున్నారు.
వడ్ల కొనుగోలు అంశం చుట్టే రాజకీయం..
ఈ రాజకీయ వేడి రాజుకోవడానికి ప్రధాన కారణం వడ్ల కొనుగోలు అంశం. ఈ యాసంగిలో వరి వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. దీంతో బీజేపీ స్పందించింది. సీఎం పంటల సాగుపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఒక సారి ఆ పంట వేయాలని, మరో సారి ఇంకో పంట వేయాలని సూచిస్తున్నారని విమర్శించారు. వరి కచ్చితంగా కొనుగోలు చేయాలని, ఈ యాసంగిలో కూడా రైతులు వరి పండించాలని అన్నారు.
దీంతో సీఎం కేసీఆర్(CM KCR) రంగంలోకి దిగారు. బీజేపీ నాయకుల మాటల వల్ల రైతులు ఆగమవుతున్నారని, ఇబ్బందులు పడతారని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యాసంగి వడ్లను కొనబోమని చెబుతోందని, కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు పంటలు వేయాలని చెబుతున్నారని అన్నారు. అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఇతర నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా వారిని టార్గెట్ చేసి మాట్లాడారు.
మరుసటి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని కౌంటర్ ఇచ్చారు. వడ్ల కొనుగోలుకు కేంద్రం సముఖంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిచారు. బీజేపీ అధ్యక్షుడు నన్ను టచ్ చేస్తే ఆరు ముక్కలు అవుతారని, ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకొని కూర్చోలేదని అన్నారు. బండి సంజయ్ ఏమైనా ట్రాక్టర్ డ్రైవర్ ఆ.. నా ఫామ్ హౌస్‌ను దున్నుతా అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఆ ఆరుగురే మిగులుతారు..
సీఎం కేసీఆర్ తనను నరుకుతాను అంటున్నారని, నన్ను బూతులు తిడుతున్నారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం తాను తల నరుక్కోవడానికి కూడా సిద్ధమేనని అన్నారు. సీఎం లక్కీ నెంబర్ ఆరు అని, ఆయన నోటి వెంట అందుకే ప్రతీ సారి ఆరు అనే నెంబర్ వస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ వెంట చివరికి మిగిలేది ఆ ఆరుగురే అని అన్నారు. రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలయ్యే వరకు బీజేపీ విడిచిపెట్టదని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అనే విషయం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: టీఆర్ఎస్ కు బిగ్ షాక్..! కేసీఆర్ భయపడ్డాడా?
హరీష్ రావుకు ఈటల వదిలేసిన వైద్యఆరోగ్యశాఖ.. రివార్డా? శిక్షనా?