Nagababu: జనసేన పై ఒక ముద్ర ఉంది. ఒక ముద్ర వేశారు కూడా. దానిని కాపుల పార్టీగా చిత్రీకరించారు. కాపు నేతలతోనే తిట్టించారు. కానీ ఎన్నడూ జనసేన కాపు ముద్ర వేసుకోలేదు. రాష్ట్రంలో అణగారిన వర్గాల కు ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతోనే జనసేన ను ఏర్పాటు చేసినట్లు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విశాల దృక్పథంతోను.. ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ పవన్ ముందుకు సాగారు. ఆయన ఔన్నత్యాన్ని గుర్తించారు కాపు సామాజిక వర్గం ప్రజలు. కేవలం పవన్ కళ్యాణ్ వెంట నడవడం కాదు.. ఆయన కుదిర్చిన.. సూచించిన కూటమికి సైతం ఓటు వేశారు. అందుకే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ నుంచి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో కొన్ని రకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన నాయకత్వం స్పందించింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు తెర వెనుక జరుగుతున్న కుట్రను, కొంతమంది వైసీపీలో ఉన్న కాపు నేతలను ప్రశ్నిస్తూ చాలా అంశాలను గుర్తు చేశారు.
* పవన్ పై టార్గెట్ చేయడంతో..
పవన్ కళ్యాణ్ ను బలహీనం చేయడం అంటే తమను తాము తగ్గించుకోవడం అనేది కాపులకు తెలుసు. ఇప్పటివరకు కాపు రాజకీయాలకు దూరంగా ఉన్న ఇప్పుడు జనసేన సైతం ముందుకు వచ్చింది. తాజాగా జనసేన ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబు సంచలన వీడియో ఒకటి విడుదల చేశారు. కొన్ని రకాల ప్రశ్నలు వేశారు. అంబటి రాంబాబు తో పాటు పేర్ని నాని లాంటి వారిని ప్రమోట్ చేస్తున్న కాపు నేతలకు నేరుగా ప్రశ్నల వర్షం కురిపించారు నాగబాబు.
* అంబటి రాంబాబు కాపుల ఐకానిక్ వంగవీటి రాధానా? అసలు అంబటి రాంబాబు పక్కన వంగవీటి బొమ్మ పెట్టాలని దిక్కుమాలిన ఐడియా ఇచ్చినవాడు ఎవడు? ముందు వాడిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మంచిది.
* కాపు నేస్తం పథకానికి కూడా జగన్ తన తండ్రి పేరు తగిలించినప్పుడు ఇప్పుడు కాపులమని గొంతు చించుకున్న అంబటి రాంబాబు, పేర్ని నాని ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? కోడి రామ్మూర్తి, సి కె నాయుడు, పుంజల శివశంకర్ వంటి ప్రముఖులు ఉన్నారు. వారిని కాదని మీ తండ్రి పేరు ఎందుకు పెట్టుకున్నావ్? అప్పుడు ఈ కాపు నేతలంతా ఎందుకు అడగలేదు?
* కాపుల మీద జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంత ప్రేమ ఉంటే వంగవీటి రాధాను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించారు? అప్పుడు మీ నోళ్లు ఎందుకు పెగలలేదు?
* రాజంపేట ఎంపీ సీటును బలిజ నాయకుడు సాయి ప్రతాప్ కి ఇవ్వకుండా మిథున్ రెడ్డికి కట్టబెడితే ఈ టైగర్లు అంబటి, పేర్ని ఎందుకు నోరు మూసుకున్నారు?
* పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే ఆయనను ఓడించేందుకు మిధున్ రెడ్డిని జగన్ ఎందుకు దించారు? పవన్ కళ్యాణ్ ని మీచే బూతులు తిట్టించేవారు. మిథున్ రెడ్డి చేత ఎందుకు తిట్టించలేదు? మిథున్ రెడ్డి పై ఈగ వాలకుండా కాపాడుకుంటున్న జగన్ మిమ్మల్ని బలి చేస్తున్నారని విషయం కూడా ఇంతవరకు మీకు అర్థం కావడం లేదు. అర్థమయి ఉండి ఉంటే మీరిద్దరూ ఆ పార్టీలోనే ఉండేవారు కాదు.
* అంబటి రాంబాబు ముఖ్యమంత్రి పై బూతులు తిడితే జైల్లో పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటూ నాగబాబు ఇచ్చి పడేశారు. ప్రస్తుతం నాగబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వైసీపీ కులచిచ్చు pic.twitter.com/ySm5FqcanP
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 8, 2026