Homeక్రీడలుక్రికెట్‌T20 World Cup: పెద్ద జట్లకు పసికూనలు చుక్కలు చూపిస్తున్నాయి..

T20 World Cup: పెద్ద జట్లకు పసికూనలు చుక్కలు చూపిస్తున్నాయి..

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో పెద్ద జట్ల హవా కొనసాగుతోందని అందరూ అనుకున్నారు. చిన్న జట్లతో జరిగే మ్యాచ్ లలో పెద్ద జట్లు ఏకపక్షంగా విజయాలు సాధిస్తాయని అందరూ ఊహించారు. కానీ, అందరి అంచనాలకు భిన్నంగా టీ20 వరల్డ్ కప్ సాగుతోంది. ఇప్పటివరకు దాదాపు ఐదు వరకు మ్యాచ్ లు పూర్తయ్యాయి.

ఈ మ్యాచ్ లలో పసి కూన జట్లు పెద్ద జట్లకు పోటీ ఇచ్చాయి. కొన్ని సందర్భాలలో గెలుపు వరకు వచ్చాయి. పెద్ద జట్ల ప్లేయర్లు తడబడుతున్న వేళ.. చిన్న జట్టు ప్లేయర్లు దుమ్మురేపారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సత్తా చూపించారు. ఫీల్డింగ్ లో ఐతే సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. దీంతో టీ 20 ప్రపంచ కప్ కాస్త ఏకపక్షంగా కాకుండా.. పోటా పోటీగా సాగుతోంది. చిన్న జట్ల ప్లేయర్ల ఆటను చూసేందుకు భారత అభిమానులు మైదానాలకు పోటెత్తుతున్నారు. వాస్తవానికి ఏకపక్షంగా సాగే మ్యాచులు చూసేందుకు అభిమానులు అంతగా రారు. కానీ, టీం ఇండియా అభిమానులు అంచనాకు తగ్గట్టుగా మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో.. మైదానాలు కిటకిటలాడుతున్నాయి.

ఇప్పటివరకు సాగిన మ్యాచ్లలో చిన్న జట్లు పెద్ద జట్లకు ఊహించని పోటీ ఇచ్చాయి. విజయాలకు దగ్గరగా వచ్చి పెద్ద జట్ల ప్లేయర్లకు చుక్కలు చూపించాయి. తద్వారా ప్రేక్షకుల మనసును గెలిచాయి. నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. ఒకానొక దశలో పాకిస్తాన్ ఓడిపోతుందని అందరూ ఒక అంచనాకొచ్చారు. ఈ దశలో పాకిస్తాన్ ప్లేయర్ స్థిరంగా నిలబడిన నేపథ్యంలో.. దాయాది జట్టు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ చివరి వరకు పోరాడింది. 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇండియా, అమెరికా మ్యాచ్లో.. పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. చివరికి భారత బ్యాటర్లకు అమెరికా బౌలర్లు చుక్కలు చూపించారు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో భారత్ అమెరికా ఎదుట చెప్పుకోదగ్గ స్థాయిలో లక్ష్యం విధించింది. ఆ తర్వాత అమెరికా బ్యాటింగ్ కూడా దాటిగానే చేసింది. కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నేపాల్ దాదాపు గెలిచినంత పని చేసింది. చివర్లో 4 పరుగులు చేయడంలో విఫలం కావడంతో నేపాల్ జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఉత్కంఠ తారస్థాయికి చేరడంతో నేపాల్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. చివర్లో ఆ పరుగులు గనుక చేస్తే నేపాల్ జట్టు కచ్చితంగా విజయం సాధించేది.

టి20 వరల్డ్ కప్ లో చిన్న జట్లు ఎందుకు అనే ప్రశ్న వ్యక్తమైనప్పుడు చాలామంది వద్ద సరైన సమాధానం లేదు. పైగా పెద్ద జట్ల ప్లేయర్లు చిన్న జట్లపై భారీగా పరుగులు చేస్తారని అందరూ అంచనా వేశారు. ఆ అంచనాలు తప్పని.. తాము సమర్థవంతమైన క్రికెట్ ఆడతామని చిన్న జట్ల ప్లేయర్లు నిరూపిస్తున్నారు. ఫలితంగా ఏకపక్షంగా సాగాల్సిన మ్యాచ్ లు హోరాహోరీగా సాగుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version