
2014 – 2019 మధ్య కాలంలో అధికారంలో ఉన్న టీడీపీ రాజధాని పేరు చెప్పి వేల ఎకరాల భూమి సేకరించింది. ఐదేళ్లలో అక్కడ కేవలం తాత్కాలిక నిర్మాణాలను మాత్రమే చేపట్టింది. గ్రాఫిక్స్ లో సింగపూర్ ను తలపించే రాజధాని కనిపించినా రియాలిటీ ఏంటో ఏపీ ప్రజానీకం మొత్తానికి తెలుసు. ఐదేళ్లలో చంద్రబాబు తాను మాటల సీఎం అని చేతల సీఎం కాదని ప్రూవ్ చేసుకున్నారు. ఫలితంగా ఏపీలో మొత్తం 23 సీట్లు మాత్రమే సాధించగలిగింది.
Also Read : ఇన్ టాక్ : చీరాల, గన్నవరంలో వైసిపి వర్గపోరు
టీడీపీని జాతీయ పార్టీగా చెప్పుకునే చంద్రబాబు రాయలసీమలో కేవలం మూడంటే మూడు సీట్లలో మాత్రమే పార్టీని గెలిపించుకున్నారంటే సీమవాసుల్లో ఆయనపై ఏ స్థాయి వ్యతిరేకత ఉందో సులభంగానే అర్థమవుతుంది. అయితే 2019లో రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి తెచ్చిన జగన్ మాత్రం చంద్రబాబు చేసిన తప్పులు చేయలేదు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మాత్రమే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని జగన్ భావించారు.
జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ఏపీ ప్రజలు సైతం మద్దతు పలికారు. తాజాగా రాజధాని ప్రాంతానికి చెందిన ఒక కానిస్టేబుల్ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా రాజీనామా చేశాడు. మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన బసవరావ్ జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇంకా అతని సర్వీస్ పదేళ్లు ఉండటం గమనార్హం. బసవరావ్ ఇంతకాలం తెలంగాణలోని హైదరాబాద్ హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పని చేశాడు.
చంద్రబాబు అమరావతి రైతుల నుంచి టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ మూడు రాజధానులకు అనుకూలంగా చట్టాలు తేవడానికి మద్దతుగా రాజీనామా చేసినట్టు తెలిపారు. కానిస్టేబుల్ త్యాగం చూసైనా చంద్రబాబులో రోషం పుట్టుకు రావాలని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి ఆ వ్యక్తిని చూసైనా చంద్రబాబు రోషం తెచ్చుకుంటాడో లేదో చూడాలి.
Also Read : అచ్చెన్న జగన్ కు జీవితాంతం రుణపడిపోవాలా….?