https://oktelugu.com/

Ayyappa Bhajan in Africa : ఆఫ్రికాలో అయ్యప్ప భజన.. ఎప్పుడూ చూడని వీడియో..

Ayyappa Bhajan in Africa : అయ్యప్ప.. భారత దేశంలో స్వామివారి భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. అత్యంత కఠిన నియమాలు, నిష్టతో స్వామివారిని పూజిస్తారు. మండల దీక్షలు స్వీకరిస్తారు. 41 రోజులు స్వీకరించే దీక్షను మండల దీక్ష అంటారు. కొంతమంది అర్ధ వార్షిక, వార్షిక దీక్షలు సైతం స్వీకరిస్తున్నారు. దీక్షా సమయంలో కఠిన నియమాలు పాటిస్తారు. దీక్ష తీసుకున్న భక్తులంతా తప్పనిసరిగా కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం అనవాయితీ. ఏటా శబరిమలకు వచ్చే […]

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2023 / 07:22 PM IST
    Follow us on

    Ayyappa Bhajan in Africa : అయ్యప్ప.. భారత దేశంలో స్వామివారి భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. అత్యంత కఠిన నియమాలు, నిష్టతో స్వామివారిని పూజిస్తారు. మండల దీక్షలు స్వీకరిస్తారు. 41 రోజులు స్వీకరించే దీక్షను మండల దీక్ష అంటారు. కొంతమంది అర్ధ వార్షిక, వార్షిక దీక్షలు సైతం స్వీకరిస్తున్నారు. దీక్షా సమయంలో కఠిన నియమాలు పాటిస్తారు. దీక్ష తీసుకున్న భక్తులంతా తప్పనిసరిగా కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం అనవాయితీ. ఏటా శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడమే స్వామిపై భక్తులకు పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం.

    పడి పూజకు ప్రాధాన్యం..
    అయ్యప్ప దీక్షలో పడిపూజకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దీక్ష తీసుకున్న ప్రతీ భక్తుడు పడిపూజ చేయకపోయినా, పడి పూజ చేసే భక్తుల ఇళ్లకు మాత్రం తప్పకుండా వెళ్లారు. పడిపూజ దీక్ష స్వీకరించినవారితోపాటు దీక్ష తీసుకోని వారు కూడా నిర్వహిస్తారు. అయితే ఈ పూజలు దీక్షాపరులే కీలకం. పడిపూజలో స్వాములంతా ఒక్కచోట చేరి అయ్యప్పను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కన్నుల పండుగవా నిర్వహించే ఈ కార్యక్రమంలో దీక్షాపరులు తన్మయంలో మునిగిపోతారు.

    విదేశాల్లోనూ అయ్యప్ప పూజలు..
    ఇక విదేశాల్లోనూ అయ్యప్ప భక్తులు, పూజలు పెరుగుతున్నాయి. దీక్ష స్వీకరించి శబరి మలకు వచ్చే వీలు లేకపోయినా.. స్వామిపై ఉన్న నమ్మకంలో దీక్ష స్వీకరించకపోయినా పూజలు, భజనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ సంస్కృతి పెరుగుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, న్యూజిలాండ్‌ దేశాల్లో భక్తులు ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో అయితే ఆలయాలు కూడా నిర్మిస్తున్నారు.

    సౌత్‌ ఆఫ్రికాలో అయ్యప్ప దేవాలయం
    దక్షిణాఫ్రికాలోని అయ్యప్ప భక్తులు ఇప్పుడు రాజధాని నగరం ప్రిటోరియాలో దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ భజనలు కూడా నిర్వహిస్తారు. గతంలో ఎన్నడూ చూడని భజన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆఫ్రికాలో భక్తులు దీక్ష స్వీకరించకపోయినప్పటికీ స్వామిని స్మరిస్తూ చేసిన భజన ఆకట్టుకుంటోంది. ఆఫ్రికా భక్తులకు స్వామిపై ఉన్న భక్తిని తెలియజేస్తోంది. ప్రిటోరియా భజనై మండ్రం సీనియర్‌ అధికారి రాజ్‌ కోలాపన్‌ మాట్లాడుతూ, భారతదేశానికి చెందిన పూజారులు ముడుపుల కార్యక్రమాన్ని నిర్వహించారని, దక్షిణాఫ్రికా నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారని తెలిపారు. హిందూ సమాజం కృషికి సాక్షాత్కారమే ఈ దేవాలయం అన్నారు. ‘భక్తులు ఇప్పుడు ఆధ్యాత్మిక సమతుల్యతను సాధించడానికి ఒక సంస్థను కలిగి ఉన్నారు, ఇది మానవాళికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల దాతృత్వం ద్వారా సాధ్యమైంది’ అని పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని దక్షిణాఫ్రికా అంతటా, ముఖ్యంగా క్వాజులు–నాటల్‌ ప్రావిన్స్‌లో భారతీయ సంతతికి చెందిన దక్షిణాఫ్రికా వాసులు నిర్మించారని తెలిపారు.

    మొత్తంగా అయ్యప్ప మహత్యంపై.. భారతీయులతోపాటు విదేశీ భక్తులకు విశ్వాసం పెరుగుతోంది. ఇందుకు తాజాగా ఆఫ్రికాలో ఆఫ్రికన్స్‌ చేస్తున్న అయ్యప్ప భజనే నిదర్శనం.