Homeఆంధ్రప్రదేశ్‌Anantapur: పట్టపగలే అత్యాచారయత్నం.. బరితెగించిన వైసీపీ నేత

Anantapur: పట్టపగలే అత్యాచారయత్నం.. బరితెగించిన వైసీపీ నేత

Anantapur: ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. అధికార మదంతో వారు వికృత చేష్టలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ వివాహితపై పట్టలే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ వైసీపీ నేత. వద్దని వేడుకుంటున్నా కర్కశంగా వ్యవహరించాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ దాడి చేశాడు. అడ్డొచ్చిన వారిని సైతం తన్నుకుంటూ పోయాడు. ప్రజలు భారీగా గుమిగూడేసరికి పరారయ్యాడు. అయితే ఇందుకు సంబంధించి వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సదరు వైసీపీ నేత తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గొల్లదొడ్డికి చెందిన వివాహిత పాల వెంకటాపురంలో వస్త్ర దుకాణాన్ని నడుపుతోంది. శుక్రవారం సాయంత్రం దుకాణం మూసేసి చెరువు కట్ట మీదుగా గ్రామానికి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో గ్రామ సచివాలయం కన్వీనర్ నటరాజ్ ఆమెను అడ్డుకున్నారు. బలవంతం చేశారు. అత్యాచారయత్నం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో నటరాజ్ విచక్షణారహితంగా దాడి చేశాడు. జుత్తు పట్టుకొని ఈడ్చి.. కాలితో తన్ని క్రూరంగా ప్రవర్తించాడు. పక్కనే పొలంలో పనిచేసుకుంటున్న రైతు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆయనపై సైతం దాడి చేశాడు. సమీపంలో ఉన్నవారు అక్కడకు చేరుకోవడంతో పరారయ్యాడు.

గ్రామస్తులు ఆ వివాహితను ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందిస్తున్నారు. సదరు వైసీపీ నేత నటరాజ్ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రధాన అనుచరుడుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సచివాలయ కన్వీనర్ గా ఉన్నారు. గతంలో ఆయన పై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అటు మంత్రి ఉష శ్రీ చరణ్ తో నటరాజ్ ఉన్న ఫోటోలు సైతం వైరల్ అవుతుండడం విశేషం. మంత్రి అనుచరుడి ఆగడాలు అంటూ ప్రత్యర్ధులు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version