https://oktelugu.com/

Safety Cars : భద్రతా (Safety) కోరుకునే వారి కోసం బెస్ట్ కారు ఇదే.. రూ.7 లక్షల లోపే..

మారుతి వ్యాగన్ ఆర్ రూ.5.54 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. కానీ భద్రతా విషయంలో మాత్రం ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 27, 2024 / 11:11 AM IST

    Tata Tiago safety car

    Follow us on

    Safety Cars : విహారయాత్రలతో పాటు తక్కువ దూరం ప్రయణాలు చేయడానికి చాలా మంది సొంత వెహికల్ ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తక్కువ ధరతో కార్లు కొనాలని చూస్తున్నారు. కానీ ధరకు, స్పెషిఫికేషన్స్ కు చాలా తేడా ఉంటోంది. ధర తక్కువగా ఉన్న కార్లలో ఫీచర్స్ అనుగుణంగా ఉండడం లేదు. అంతేకాకుండా సేప్టీ విషయంలోనూ మిగతా వాటికంటే తక్కువే అని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో ఓ కంపెనీ తక్కువ ధరతో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి ఓ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా మైలేజ్ విషయంలోనూ మిగతా వాటికి గట్టి పోటీ ఇస్తోంది. మరి ఆ కారు గురించి తెలుసుకుందామా..

    భారత్ లో కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. ప్రపంచంలోని చాలా కార్ల కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. కానీ ఎక్కువ మంది తక్కువ ధరకు కారు కొనాలని చూస్తారు. ఇదే సమయంలో మైలేజ్ తో పాటు సేప్టీ ఉండాలని కోరుకుంటున్నారు. వినియోగదారుల అభిరుచులను క్యాచ్ చేసిన టాటా కంపెనీ ఓ కారును మార్కెట్లోకి ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఇది మిగతా కార్ల కంటే భద్రత విషయంలో బెటర్ ఆప్షన్ అనిపించుకుంటుంది.

    టాటా కంపెనీ నుంచి రిలీజ్ అయిన టియాగో గురించి కార్లు వాడేవారికి తెలిసే ఉంటుంది. కానీ ఇందులో ఫీచర్స్ గురించి తక్కువ మందికే తెలుసు. టాటా టియాగో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 86 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పెట్రోల్ తో పాటు CNG వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. దీంతో లీటర్ పెట్రోల్ కు 19.01 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీ వెర్షన్ లో 26.49 కిలోమీటర్ల వరకు దూసుకుపోతుంది. టాటా టియాగో రూ.5.60 లక్షల ప్రారంభ ధర ఉండగా టాప్ ఎండ్ రూ.8.20 లక్షలతో విక్రయిస్తున్నారు.

    దేశీయ మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకే మారుతి వ్యాగన్ ఆర్ రూ.5.54 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. కానీ భద్రతా విషయంలో మాత్రం టాటా టియాగో బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఓవర్ స్పీడ్ వార్నింగ్, స్పీడ్ డిపెండెంట్ ఆటో డోర్ లాక్, రివర్స్ కెమెరా, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ABS తో పాటు EBDని కలిగి ఉంది. ఓవర్ స్పీడ్ వెళ్లాలనుకునేవారికి ముందుగానే వార్నింగ్ ఇవ్వడం ఆకర్షిస్తోంది. దీంతో భద్రతపై దృష్టి పెట్టాలనుకునేవారికి ఇది మంచి కారు అని చెబుతున్నారు.