https://oktelugu.com/

కారులో ముగ్గురు ఉండగానే తగలబెట్టేశాడు… విజయవాడలో దారుణం!

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఉదంతం మర్చిపోకముందే ఇప్పుడు మరో ఘోరం చోటుచేసుకుంది. అయితే ఇది ప్రమాదం కాదు… హత్యాయత్నం! బెజవాడలో జరిగిన హత్యాయత్నం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ముగ్గురు వ్యక్తులు కారు లో ఉండగానే మరో వ్యక్తి కారు పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు. విజయవాడ డీఎస్పీ హర్షవర్ధన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. Also Read: […]

Written By: , Updated On : August 18, 2020 / 08:01 AM IST
Follow us on

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఉదంతం మర్చిపోకముందే ఇప్పుడు మరో ఘోరం చోటుచేసుకుంది. అయితే ఇది ప్రమాదం కాదు… హత్యాయత్నం! బెజవాడలో జరిగిన హత్యాయత్నం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ముగ్గురు వ్యక్తులు కారు లో ఉండగానే మరో వ్యక్తి కారు పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు. విజయవాడ డీఎస్పీ హర్షవర్ధన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Also Read: కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

ఇక వివరాల్లోకి వెళితే నగరంలోని ప్రముఖ నోవాటెల్ హోటల్ వద్ద జరిగిన ఈ సంఘటనలో ముందుగా ఆగి ఉన్న కారు వద్ద నలుగురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఇక స్థానికులు అందించిన సమాచారం ఏమిటంటే వీరు నలుగురూ ఒక ల్యాండ్ విషయమై కారులో కూర్చుని మాట్లాడుకుంటున్నారట. ఈ నలుగురి పేర్లు కృష్ణారెడ్డి, గంగాధర్, నాగమల్లి, వేణుగోపాల్ రెడ్డి గా గుర్తించారు. అయితే వాదన మధ్యలో వేణుగోపాల్ రెడ్డి ఏమైందో ఏమో తెలియదు కానీ బయటికి వచ్చి కార్ డోర్ లాక్ చేశాడు. వెంటనే కారు పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Also Read: దెబ్బకి జగన్ పరువంతా పోయింది..! “నిండా మునిగిపోయాడు”

అంతే…. కారు డోర్ లాక్ చేసి ఉండడంతో మంటల్లో చిక్కుకొని లోపల ఉన్నవారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పి వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో నాగమల్లి, కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో కారు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. వీరి మధ్య పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా లేదా ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో వచ్చిన గొడవల వల్ల నే వేణుగోపాల్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వేణుగోపాల్ రెడ్డి పరారీలో ఉన్నాడు. పోలీసులు సమాచారం అందుకున్న పిమ్మట ఈ సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు